తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..
Breaking News
కెవ్వు.. కాకి..! పెలికాన్కు దిమ్మతిరిగే షాక్! అసలేం జరిగిందంటే?
Published on Mon, 10/26/2026 - 11:18
చేప కనిపిస్తే చాలు.. పక్షులు వేటకు సిద్ధమైపోతాయి! కానీ ఇక్కడో పెలికాన్ మాత్రం మరో అడుగు ముందుకేసింది. వేరే పక్షి నోట్లో ఉన్న చేపను కూడా కొట్టేయాలని చూసింది.. కానీ చివరకు దానికి నిరాశే మిగిలింది! వివరాల్లోకి వేళ్తే..
చెరువుల దగ్గర చేపల కోసం పక్షులు రావడం కామనే. అలాంటి వాటిల్లో పెలికాన్లు, కార్మొరెంట్స్, కొంగలు వంటివి ఉంటాయి. కార్మొరెంట్స్.. వీటిని కొన్ని ప్రాంతాల్లో నీటి కాకులని పిలుస్తారు. అయితే.. పెలికాన్లు మహా గడుసువట. ఆహారం కోసం ఎంతకైనా తెగిస్తాయట.
ఎంతవరకూ అంటే.. ఇదిగో ఈ నీటి కాకి మింగిన చేపను.. దాని గొంతు నొక్కి.. మరీ కొట్టేసేంత వరకూ.. అది చేపను బయటకు కక్కితే.. వెంటనే పట్టేయడానికి చాటంత ఉన్న తన నోటిని ఇలా తెరుస్తాయి. సాధారణంగా కాకులు తెలివైనవని అంటారు. నీటి కాకుల సంగతి మనకు తెలియదుగానీ.. దీనికి ఆ వారసత్వం కొంత వచ్చినట్లు ఉంది. పెలికాన్ తన గొంతు పట్టుకున్నా.. పట్టు విడవకుండా.. సేఫ్గా చేపను గొంతును దాటించేసి.. పొట్టలోకి పంపేసింది. దీంతో చేసేదేమీ లేక పెలికాన్ నోరు వెళ్లబెట్టింది.
ఇదీ చదవండి: 'పాము కాటు కాదు.. పాముకే కాటు' ఎవరైతేనేం.. అస్సలు తగ్గేదేలే!!
Tags : 1