Breaking News

ఒక్క ఛార్జ్‌తో 600 కిమీ రేంజ్.. భారత్‌లోకి కొత్త కార్లు!

Published on Sun, 10/25/2026 - 18:55

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ బీవైడీ (BYD) భారత్‌లో తన లగ్జరీ కార్ల బ్రాండ్‌ డెన్జా (Denza)ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. నవంబర్‌ 13న ఈ బ్రాండ్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న బీవైడీ.. ఇప్పుడు ఖరీదైన ప్రీమియం కార్ల మార్కెట్‌పై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా డెన్జా బ్రాండ్‌ కింద డీ9 లగ్జరీ ఎంపీవీ, జెడ్‌9 జీటీ ఎలక్ట్రిక్‌ కార్లను తీసుకురానున్నట్లు సమాచారం.

డెన్జా డీ9 అనేది.. ఒక లగ్జరీ ఎంపీవీ. ఇందులో మూడు వరుసల సీటింగ్ పొజిషన్ ఉండటం వల్ల, ఏడుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది ఎంజీ ఎం9 వంటి లగ్జరీ ఎంపీవీలకు పోటీ ఇవ్వనుంది. అంతర్జాతీయ మార్కెట్లోని ఈ కారు ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో 103.36kWh బ్యాటరీ(520 కిమీ రేంజ్)తో లభిస్తోంది. రెండో వరుస సీట్లకు ఎలక్ట్రిక్‌ అడ్జస్ట్‌మెంట్‌, వెంటిలేషన్‌, మసాజ్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. అయితే.. భారత్‌లో ఏ మోడల్ లాంచ్ అవుతుంది?, దాని ధర ఎంత అనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మరోవైపు.. డెన్జా జెడ్‌9 జీటీ స్పోర్టీ డిజైన్‌, శక్తివంతమైన పనితీరుతో ఆకట్టుకోనుంది. దీని ధర రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ వెర్షన్‌లో మూడు ఎలక్ట్రిక్‌ మోటార్లు ఉండగా.. అవి 1,156 హెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కారు కేవలం 2.7 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులోని 122.5kWh బ్యాటరీ.. ఒక్కసారి ఛార్జ్‌తో 600 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. భారత వెర్షన్‌ స్పెసిఫికేషన్లు వెల్లడి కావాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఆరమ్ ఎడిషన్‌తో.. విక్టోరిస్ మరింత కొత్తగా!

Videos

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)