Breaking News

వెండి ధరల్లో కలకలం.. కొనేవారికి బిగ్‌ అప్‌డేట్‌!

Published on Sun, 10/25/2026 - 15:46

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, అమెరికాలో వడ్డీ రేట్లు మరోసారి పెరిగే అవకాశాలు వంటివి సాధారణంగా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తాయి. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత కొన్ని రోజులుగా గోల్డ్, సిల్వర్ రేట్లు గణనీయంగా తగ్గుతున్నాయి. ఇది పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు 4,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ.. ఇప్పుడు పతనావస్థలోనే అడుగులు వేస్తోంది. వెండి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకప్పుడు ఔన్సుకు 120 డాలర్ల స్థాయిలో ఉన్న వెండి.. ఇప్పుడు ధర 53.8 డాలర్లకు పడిపోయింది. ఈ ప్రభావం భారత మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

దేశీయ ఎంసీఎక్స్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ.4.2 లక్షల నుంచి రూ.2.0 లక్షల స్థాయికి దిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా సిల్వర్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కోటక్‌ నియోకు చెందిన కమోడిటీ రీసెర్చ్‌ నిపుణురాలు కయ్నాత్‌ చైన్‌వాలా అభిప్రాయం ప్రకారం.. రానున్న రోజుల్లో వెండికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో వెండికి డిమాండ్ ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితులు బలహీనపడితే పరిశ్రమల్లో వెండి వినియోగం తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే సిల్వర్ రేటు భారీగా తగ్గుతుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర ఔన్సుకు 50 డాలర్ల దిగువకు చేరితే, దేశీయంగా కేజీ వెండి ధర రూ.1.9 లక్షల కంటే దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కూడా కీలకం కానుంది. అక్టోబర్‌ 27, 28 తేదీల్లో జరగనున్న సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై మార్కెట్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రేట్ల పెంపును వాయిదా వేస్తే బంగారం, వెండి ధరలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది. అయితే.. మధ్య ప్రాచ్యంలో సౌదీ అరేబియా, హౌతీ దళాలకు సంబంధించిన ఉద్రిక్తతలు పెరిగితే పరిస్థితి మళ్లీ మారవచ్చు. ముఖ్యంగా చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే.. ధరలు మరింత పెరిగి, ద్రవ్యోల్బణ భయాలు ఎక్కువవుతాయి. దీంతో అమెరికా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగవచ్చనే అంచనాలు బలపడతాయి.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్.. ఇక ఏం జరగనుంది?

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా..
బంగారం, వెండి ధరలు నేడు (ఆదివారం) నిలకడగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు  ఉపశమనం లభించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

Videos

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)