Breaking News

అథ్లెట్స్ రూట్‌లో CEO.. సక్సెస్ కోసం స్పెషల్ ప్లాన్!

Published on Tue, 10/20/2026 - 16:31

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మధ్య చాలామంది ఇబ్బందిపడుతున్న వేళ.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్న భారత సంతతి వ్యాపారవేత్త హార్దిక్ జగ్డా రోజువారీ జీవనశైలి ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ప్రాక్సిమిటీ వర్క్స్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన హార్దిక్ జగ్డా.. ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య నిద్రలేస్తారు. వారంలో ఆరు రోజులు పనిచేసే ఆయన.. ఉదయం లేవగానే ఫోన్ చూడటం, ఈమెయిల్స్ చెక్ చేయడం వంటివి చేయరు. ఆ సమయాన్ని వ్యాయామం, కంపెనీ అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం కేటాయిస్తారు. ఉదయం 7 గంటలు దాటితే తన సమయం తన చేతుల్లో ఉండదని ఆయన చెబుతున్నారు.

హార్దిక్ ఈ అలవాటును ఎందుకు మొదలుపెట్టారంటే.. వ్యాపారవేత్తలు, క్రీడాకారుల జీవిత చరిత్రలు చదివేటప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. చాలామంది అథ్లెట్లు ఉదయాన్నే శిక్షణ తీసుకుంటూ, మిగతా సమయంలో విశ్రాంతికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. దీంతో తాను కూడా అదే పద్ధతిని అనుసరించడం ప్రారంభించారు.

ఈ కారణంగానే.. ఉదయం 3 నుంచి 6 గంటల వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముఖ్యమైన పనులపై దృష్టి పెడతారు. ఇలా మిగతా పనులు మొదలయ్యేలోపే కంపెనీ కోసం నాలుగు నుంచి ఐదు గంటల సమయాన్ని వినియోగించుకోగలుగుతున్నారు. ఈ అలవాటు వ్యాపారంలోనూ తనకు ఉపయోగపడిందని హార్దిక్ తెలిపారు.

రెండేళ్ల క్రితం ఒక కొత్త ప్రాజెక్టు కోసం తక్కువ సమయంలో ఎక్కువ మంది ఇంజినీర్లను నియమించాల్సి వచ్చింది. అప్పుడు తన బృందంతో కలిసి రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మార్పులు చేశారు. దీంతో నియామక ప్రక్రియను 72 గంటల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించగలిగారు. ఉదయం ప్రశాంతంగా ఆలోచించడానికి సమయం ఉండటం వల్లే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారాల్లో కూడా పబ్లిక్ స్పీకింగ్ వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సమయం కేటాయిస్తారు.

అయితే.. తాను ఎక్కువ గంటలు పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగులందరూ అలాగే పనిచేయాలని హార్దిక్ కోరుకోవడం లేదు. ముఖ్యంగా 996 వర్క్ కల్చర్‌ను ఆయన వ్యతిరేకిస్తారు. ఈ విధానంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారంలో ఆరు రోజులు పనిచేయాలి. అంటే వారానికి 72 గంటలు పని చేయాల్సి ఉంటుంది.

తన కంపెనీలో మాత్రం ఉద్యోగులు తమకు అనుకూలమైన సమయంలో పనిచేసుకోవచ్చని, రాత్రిపూట ఎక్కువ ఉత్పాదకతతో పనిచేసేవారికీ అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. అయితే, టీమ్‌లోని ఇతర సభ్యులతో రోజుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు సమన్వయం ఉండాలని సూచిస్తున్నారు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)