Breaking News

తెలుగు ప్రేక్షకుల అభిమానం విలువైనది

Published on Tue, 10/20/2026 - 04:33

‘‘హైదరాబాద్‌కు రావడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానం నాకు చాలా విలువైనవి. కొన్ని కథలు కేవలం చెప్పడానికే కాదు. మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. అలాంటి చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి’’ అని రణ్‌బీర్‌ కపూర్‌ తెలిపారు. భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా రూపొందిన హిందీ సినిమా ‘రామాయణ’ (తెలుగులో ‘రామాయణం’). ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీడియోల్, రావణుడిగా యశ్‌ నటించారు. 

నితేష్‌ తివారీ దర్శకత్వంలో ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్, మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్ పై నమిత్‌ మల్హోత్రా, యశ్‌ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘రామాయణ పార్ట్‌ 1’ నవంబరు 5న విడుదల కానుంది. ‘రామాయణ పార్ట్‌ 2’ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్‌ కానుంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘రామాయణ పార్ట్‌ 1’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో రాముడి పాత్రలో నటించడం నాకు ఓ ఎమోషనల్‌ జర్నీ. ‘దిల్‌’రాజుగారితో మూడోసారి అసోసియేట్‌ కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. 

సాయిపల్లవి మాట్లాడుతూ–‘‘సీత పాత్రను పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. యశ్‌ మాట్లాడుతూ– ప్రాంతీయ సినిమాలను ఎంతంటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లవచ్చో తెలుగు ఇండస్ట్రీ చూపించింది. ఇక్కడ రాజమౌళి, ప్రభాస్, తారక్, రామ్‌చరణ్‌... ఇలా ఇంకొందరు ఉన్నారు. సినిమాలపై ΄్యాషన్  ఉన్న వ్యక్తి ‘దిల్‌’ రాజుగారు. శ్రీరాముడు, రావణుడు పాత్రలను చాలా బ్యాలెన్్డ్సగా సినిమా తీశారు నితీష్‌. రణ్‌బీర్‌ కపూర్‌లో ఏమాత్రం ఈగో లేదు. ఏ ఇండస్ట్రీ అభిమానులైనా సరే ‘రామాయణం’ నచ్చితే.. ఈ చిత్రాన్ని ప్రపంచానికి చూపించండి’’ అని కోరారు. 

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ–‘‘నా కలను నిజం చేసిన హైదరాబాద్‌ అంటే నాకు చాలా ఇష్టం. ‘రామాయణం’ వంటి పెద్ద సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. డైరెక్టర్‌ నితీష్‌ తివారీ మాట్లాడుతూ–‘‘రామాయణం’ సినిమాను మీరు హిందీలో చూసినా, తెలుగులో చూసినా మాపై ఒకే ప్రేమను చూపిస్తారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. 

నిర్మాత నమిత్‌ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘ప్రతి భారతీయుడు గర్వపడేలా ‘రామాయణం’ సినిమా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ–‘‘రామాయణం’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మా శ్రీ వెంకటేశ్వర సంస్థ రిలీజ్‌ చేస్తోంది. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ అనగానే మనకు హాలీవుడ్‌ సినిమాలు గుర్తుంటాయి. మనదగ్గర రాజమౌళిగారు మన సినిమాలకు అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ చూపించారు. మళ్లీ ఇప్పుడు మనం ఆ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ను ‘రామాయణం’ సినిమాలో చూడబోతున్నాం. రణ్‌బీర్‌కపూర్‌ ‘బ్రహ్మాస్త్ర’, ‘యానిమల్‌’ మేమే డిస్ట్రిబ్యూట్‌ చేశాం’’ అని తెలిపారు. ‘‘రామాయణం’ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్ ను అందిస్తుంది’’ అన్నారు దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)