Breaking News

భారత్‌లో రూ.12.79 లక్షల బైక్ లాంచ్!

Published on Mon, 10/19/2026 - 21:09

ప్రముఖ బైక్‌ తయారీ సంస్థ కవాసాకి భారత్‌లో కొత్త 2027 జెడ్1100 బైక్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.12.79 లక్షలు. స్పోర్టీ లుక్‌, శక్తివంతమైన ఇంజిన్‌, అధునాతన ఫీచర్లతో రూపొందించిన ఈ బైక్‌ ప్రీమియం నేకెడ్‌ బైక్‌ విభాగంలో అందుబాటులోకి వచ్చింది.

ఈ బైక్‌లో 1,099 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇన్‌లైన్‌ ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 9,000 ఆర్‌పీఎం వద్ద 136 బీహెచ్‌పీ పవర్‌, 7,600 ఆర్‌పీఎం వద్ద 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్‌, స్లిప్పర్‌ క్లచ్‌ను పొందుతుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది.

సస్పెన్షన్‌ కోసం ముందు భాగంలో షోవా SFF-BP ఇన్వర్టెడ్‌ ఫోర్క్‌, వెనుకవైపు హారిజాంటల్‌ బ్యాక్‌లింక్‌ సస్పెన్షన్‌ను ఇచ్చారు. బ్రేకింగ్‌ కోసం ముందు రెండు 277 మి.మీ. డిస్కులు, వెనుక 226 మి.మీ. డిస్క్‌ ఉన్నాయి. ఈ బైక్‌లో డన్‌లప్‌ స్పోర్ట్‌మ్యాక్స్‌ Q5A టైర్లను ఉపయోగించారు.

ఫీచర్ల విషయానికి వస్తే.. 5 ఇంచెస్ TFT డిస్‌ప్లేతో పాటు స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీని అందించారు. రైడింగ్‌ సమయంలో భద్రతను మెరుగుపరిచేందుకు ట్రాక్షన్‌ కంట్రోల్‌, కార్నరింగ్‌ ఏబీఎస్, కార్నరింగ్‌ మేనేజ్‌మెంట్‌, వివిధ రైడింగ్‌ మోడ్‌లను ఇచ్చారు. రెండు దిశల్లో పనిచేసే క్విక్‌షిఫ్టర్‌, ఎలక్ట్రానిక్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ కూడా ఇందులో ఉన్నాయి.

ఇదీ చదవండి: ఎగిరే కారు కోసం బుకింగ్స్ స్టార్ట్!

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)