Breaking News

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. డ్రైవర్ పరిస్థితి విషమం

Published on Sun, 10/18/2026 - 20:10

బాఘీ, బాఘీ 2, వార్ సినిమాల ఫేమ్ బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌పై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ముంబైలోని ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. ఈ దాడిలో టైగర్ ష్రాఫ్ కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనలోనే మరో వ్యక్తి గాయపడ్డాడు. ఇప్పుడీ విషయం బాలీవుడ్‌లో షాకింగ్‌గా మారింది.

ఈ దాడి చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో వీళ్లు సల్మాన్ ఖాన్‌పై కూడా కాల్పులు జరిపారు. మరోవైపు జుహు పరిధిలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో టైగర్ ష్రాఫ్ క్షేమంగా ఉన్నారని డీసీపీ మోహిత్ గార్గ్ స్పష్టం చేశారు.

ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు లేదా వారి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా ధ్రువీకరించలేదు. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులని గుర్తించేందుకు, దాడి వెనుక ఉన్న అసలు కారణాలను తేల్చేందుకు ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణను కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. విచారణకు ఆదేశించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)