Breaking News

నవరాత్రుల స్పెషల్‌ వంటకాలు..చేసేయండిలా!

Published on Sun, 10/18/2026 - 16:34

బెల్లం అన్నం
కావలసినవి: బియ్యం: కప్పు, బెల్లం: ముప్పావు కప్పు, నెయ్యి: 2 టేబుల్‌ స్పూన్లు, పాలు: అర కప్పు, ఏలకుల పొడి: అర టీ స్పూన్, జీడిపప్పు, కిస్మిస్‌: కొద్దిగా

తయారీ: ముందుగా బియ్యాన్ని మెత్తగా ఉడికించాలి. బెల్లాన్ని కొద్దిగా నీటిలో కరిగించి వడకట్టాలి. ఒక పాత్రలో బెల్లం పాకాన్ని మరిగించి, అందులో అన్నం వేసి బాగా కలపాలి. తరువాత పాలు, నెయ్యి, ఏలకుల పొడి వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. చివరగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌ వేసి కలపాలి. వేడి వేడిగా వడ్డిస్తే రుచికరమైన బెల్లం అన్నం సిద్ధం.

భగర్‌ కిచిడీ
కావలసినవి: భగర్‌ (సామలు లేదా వ్రత బియ్యం): కప్పు, పెసరపప్పు: అర కప్పు, వేరుశెనగపప్పు: 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి: 2, జీలకర్ర: అర టీ స్పూన్, నెయ్యి: టేబుల్‌ స్పూన్, ఉప్పు: తగినంత, నీరు: 3 కప్పులు. 

తయారీ: ముందుగా భగర్, పెసరపప్పును కడిగి పక్కన పెట్టాలి. కుక్కర్‌లో నెయ్యి వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, వేరుశెనగపప్పు వేయించాలి. తరువాత భాగర్, పెసరపప్పు, ఉప్పు వేసి కలపాలి. తగినంత నీరు పోసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి. కుక్కర్‌లో ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసి బాగా కలపాలి. వేడి వేడిగా వడ్డిస్తే రుచికరమైన భాగర్‌ కిచిడీ సిద్ధం.

కదంబం
కావలసినవి: బియ్యం: కప్పు, కందిపప్పు: 
అర కప్పు, కూరగాయలు (క్యారెట్, బీన్స్‌, వంకాయ, సొరకాయ): 2 కప్పులు, 
చింతపండు: చిన్న నిమ్మకాయంత, సాంబార్‌ పొడి: 2 టేబుల్‌ స్పూన్లు, పసుపు: పావు టీ స్పూన్, ఉప్పు: తగినంత, నెయ్యి: టేబుల్‌ స్పూన్, తాలింపు కోసం– నూనె: టేబుల్‌ స్పూన్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు.

తయారీ: ముందుగా బియ్యం, కందిపప్పును కడిగి కుక్కర్‌లో వేసి తగినంత నీరు పోసి, మెత్తగా ఉడికించాలి. మరో పాత్రలో కొద్దిగా నూనె వేసి కూరగాయలను వేయించి, పసుపు, ఉప్పు, సాంబార్‌ పొడి వేసి ఉడికించాలి. తరువాత చింతపండు రసం పోసి కొన్ని నిమిషాలు మరిగించాలి. ఇందులో ఉడికించిన అన్నం, పప్పు వేసి బాగా కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. చివరగా నెయ్యి వేసి తాలింపు పెట్టాలి. వేడి వేడిగా కదంబాన్ని వడ్డిస్తే రుచిగా ఉంటుంది.

శాకాన్నం
కావలసినవి: బియ్యం: కప్పు, రకరకాల కూరగాయల ముక్కలు: 2 కప్పులు, పెసరపప్పు: అర కప్పు, పచ్చిమిర్చి: 2, అల్లం: చిన్న ముక్క, పసుపు: పావు టీ స్పూన్, ఉప్పు: తగినంత, నెయ్యి: టేబుల్‌ స్పూన్, తాలింపు కోసం: జీలకర్ర, ఆవాలు, కరివేపాకు.

తయారీ: బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో వేసుకోవాలి. అందులో తరిగిన కూరగాయలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, ఉప్పు, తగినంత నీరు వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో తాలింపు వేసి అన్నంలో కలపాలి. వేడి వేడిగా వడ్డిస్తే రుచికరమైన శాకాన్నం సిద్ధం.

ఇదీ చదవండి: గుమ్మడితో పండగ ముస్తాబు! దిష్టికే కాదు..అలంకరణకుకూడా..

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)