Breaking News

ఒక్క రూపాయి రీచార్జ్‌ ఆఫర్‌.. అన్‌లిమిటెడ్‌ బెనిఫిట్స్‌!

Published on Sun, 10/18/2026 - 14:18

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్‌ఎల్) తన ప్రత్యేక రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్‌ను మరోసారి పొడిగించింది. ‘ఫ్రీడమ్ 2.0’ పేరుతో అందిస్తున్న ఈ ప్లాన్‌ను వినియోగదారులు నవంబర్ 9 వరకు పొందవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను కోరుకునే మొబైల్ వినియోగదారులకు ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఈ ప్లాన్‌ సర్వీస్ వ్యాలిడిటీని గతంలో ఉన్న 30 రోజుల నుంచి 24 రోజులకు సవరించారు.

రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్

బీఎస్ఎన్‌ఎల్ రూ.1 ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. దీంతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 1GB హైస్పీడ్ డేటాను అందిస్తున్నారు. ఈ ప్రయోజనాలు 24 రోజుల వ్యాలిడిటీకి వర్తిస్తాయి. అంటే, తక్కువ మొత్తంతో కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను పొందాలనుకునే వారికి ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.

నవంబర్ 9 వరకు ఆఫర్

ఫ్రీడమ్ 2.0 పేరుతో అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్‌ను బీఎస్ఎన్‌ఎల్ నవంబర్ 9, 2026 వరకు పొడిగించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు తమ సమీపంలోని బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధీకృత రిటైలర్‌ను సంప్రదించి ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే. ఇదివరకే ఒకసారి సిమ్‌ తీసుకుని వినియోగిస్తున్నవారికి ఈ ఆఫర్‌ వర్తించదు.

ఇదీ చదవండి: రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)