Breaking News

2026 హీరో ఎక్స్‌ట్రీమ్ లాంచ్: ధర ఎంతంటే?

Published on Sat, 10/17/2026 - 11:20

హీరో మోటోకార్ప్.. దేశీయ విఫణిలో 2026 ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి బైకును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది స్టాండర్డ్, ప్రో, కార్బన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ప్రో, కార్బన్ వేరియంట్ల డెలివరీలు నవంబర్ 1, 2026 నుంచి ప్రారంభమవుతాయి. స్టాండర్డ్ వేరియంట్ జనవరి 2027 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

2026 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి కొంత అప్డేట్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇది కొత్త రంగులలో కూడా లభిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ ఫైర్‌స్టార్మ్ రెడ్, పెర్ల్ బ్లాక్ రంగులలో.. ప్రో వేరియంట్ ప్రో రెడ్, ప్రో బ్లాక్ రంగులలో లభిస్తుండగా, కార్బన్ వేరియంట్ కార్బన్ రెడ్, కార్బన్ బ్లాక్, కార్బన్ గ్రే, అబ్రాక్స్ ఆరెంజ్ రంగులలో లభిస్తుంది.

మూడు వేరియంట్లలోనూ 164.32 సీసీ ఇంజన్‌ ఉంటుంది. ఇది 8750 rpm వద్ద 17.1 హార్స్ పవర్, 6500 rpm వద్ద 14.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్టాండర్డ్ వేరియంట్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, మెకానికల్ థ్రాటిల్, సింగిల్ ఛానల్ ఏబీఎస్‌తో కూడిన డ్యూయల్ డిస్క్ బ్రేకులు, ఒక ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ లభిస్తాయి.  2026 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి బైక్.. దేశీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. బంగారం ధరల్లో మార్పు!

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి