Breaking News

గగన్‌యాన్‌ ప్రయోగంలో కీలక ముందడుగు

Published on Sat, 10/17/2026 - 08:13

భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర లక్ష్యంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక మైలురాయిని అధిగమించింది. వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యూల్‌ (సీఎం), దానికి అనుసంధానమైన సర్వీస్‌ మాడ్యూల్‌ (ఎస్‌ఎం) విడిపోయే వ్యవస్థపై పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. 2026లో లక్ష్యంగా పెట్టుకున్న తొలి మానవ రహిత ప్రయోగం జీ1 సన్నద్ధతకు ఈ పరీక్షలు కీలకంగా నిలవనున్నాయి.

అత్యంత కీలక దశ

గగన్‌యాన్‌ ఆర్బిటల్‌ మాడ్యూల్‌లో క్రూ మాడ్యూల్‌, సర్వీస్‌ మాడ్యూల్‌ ఉంటాయి. ప్రయోగం ప్రాథమిక దశ నుంచి కక్ష్యలోని కార్యకలాపాల ముగింపు వరకు ఈ రెండు భాగాలు అనుసంధానమై పనిచేస్తాయి. భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే ముందు క్రూ మాడ్యూల్‌ సర్వీస్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోవాలి. ఈ ప్రక్రియలో పలు దశల్లో పైరోటెక్నిక్‌ పరికరాలు, విడదీసే యంత్రాంగాలు నిర్దిష్ట క్రమంలో పనిచేయాల్సి ఉంటుంది.

ఈ వ్యవస్థ పనితీరును ధ్రువీకరించేందుకు తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రంలో ప్రత్యేక పరీక్షా ఏర్పాట్లు చేశారు. రెండు మాడ్యూళ్ల మధ్య విద్యుత్‌, ద్రవ సరఫరా సంబంధాలను కలిపే అంబిలికల్‌ కనెక్షన్లు తెగిపోయే పరిస్థితులను కూడా పరీక్షల్లో అనుకరించారు.

వ్యోమగాముల భద్రతకు భరోసా

విభజన సమయంలో ఏర్పడే ప్రకంపనలను క్రూ మాడ్యూల్‌లోని కీలక ఉపవ్యవస్థలు తట్టుకోగలవా అన్నది పరీక్షించారు. ఏవియానిక్స్‌, నావిగేషన్‌ వ్యవస్థలు, అంబిలికల్‌ షీల్డ్‌, క్రూ మాడ్యూల్‌ను సముద్రంలో నిటారుగా నిలిపే వ్యవస్థకు సంబంధించిన కీలక పరికరాల దృఢత్వాన్ని పరిశీలించారు. ఆగస్టు 2026లో తెలిపిన సమాచారం ప్రకారం, తొలి మానవరహిత ప్రయోగంలో(జీ1) వ్యోమమిత్ర హాఫ్‌-హ్యూమనాయిడ్‌ను(కొన్ని మానవ లక్షణాలు కలిగిన రోబో) పంపి కీలక సాంకేతికతలను పరీక్షించనున్నారు. అనంతరం మరో రెండు మానవరహిత ప్రయోగాలు చేపట్టి, మానవ సహిత యాత్రకు అవసరమైన వ్యవస్థలను ధ్రువీకరించాలన్నది ప్రణాళిక.

ఇదీ చదవండి: ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నా ఆస్తి ఇవ్వాలా?

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి