Breaking News

ఎవరీ తేజస్‌ సుదర్శన్‌? జస్ట్‌ 90 సెకన్లలో మోదీకి..

Published on Fri, 10/16/2026 - 15:17

అవకాశాలు కోరుకున్నప్పుడు రావు. వచ్చినప్పుడు తెలివిగా వాడుకోవడం తెలియాలి. అలాంటివాళ్లే సక్సెస్‌ చేరువ కాగలరు. నిజానికి ఎదిగే క్రమంలో అందరు ఒక్క అవకాశం అని కోటి ఆశలతో ఎదురు చూస్తాం. కానీ ఈ చెన్నై కుర్రాడు రాదేమో అనుక్ను అవకాశాన్ని భలే ఉపయోగించుకుని ఏకంగా ప్రధాని మోదీకే ఏఐ పాఠాలు చెప్పి వార్తల్లో నిలిచాడు. అంతేగాదు ఎవరా ఆ కుర్రాడు అంటూ మీడియాలో అతడిపై కథనలు కూడా వచ్చేశాయి. ఇంతకీ ఆ యువకుడు ఎవరు?, ఏమా కథ చూద్దామా..!. 

ఆ కుర్రాడే చెన్నేకి చెందిన తేజస్‌ సుదర్శన్‌. విన్సెన్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు. అక్టోబర్ 11, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై పర్యటనలో భాగంగా ఎయిర్‌పోర్ట్ నుంచి పూనమల్లి వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధానితో సంభాషించడానికి ఎంపిక చేసిన 17 మంది స్టార్టప్ వ్యవస్థాపకులలో ఈ తేజస్ కూడా ఒకరు. మెట్రో ప్రయాణంలో తన వంతు వచ్చేసరికి రైలు స్టేషన్‌కు చేరుకోవడంతో సమయం అయిపోయిందని అనుకున్నాడు. 

సరిగ్గా ఆ టైంలో మోదీ మిగిలిన వారి మాటలు కూడా విందామని కోరడంతో అతడికి 90 సెక్షన్ల సమయంలో లభించింది. ఆ కొద్ది సమయంలోనే తన ఏఐ ఊడియాలు వివరించారు. అవేంటంటే..విద్యార్థులు ఆచరణాత్మక అనుభవాన్ని పొందడానికి, అలాగే ప్రభుత్వ సేవలను సులభంగా పొందేందుకు AI ఎలా సహాయపడుతుందో జస్ట్‌ 90 సెకన్లలో వివరించారు. అలా తన అవకాశాన్ని చాకచక్యంగా సద్వినియోగం చేసుకున్నాడు తేజస్‌. 

వివరించిన రెండు ఐడియాలు..

ఒక యూట్యూబ్ వీడియోలో, సుదర్శన్ తన రెండు ప్రతిపాదనలను వివరించారు. 

ఆయన మొదటి ఆలోచన, విద్యార్థులను నిజ జీవిత AI అప్లికేషన్‌లతో అనుసంధానించడం. ప్రభుత్వ విభాగాలు విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేసి, విద్యార్థులకు పరిష్కరించడానికి ఆచరణాత్మక సమస్యలను ఇవ్వాలని ఆయన సూచించారు. ఇది విద్యార్థులకు తమ జ్ఞానాన్ని ఉపయోగించి నిజమైన పరిపాలనా సవాళ్లను పరిష్కరించడానికి వీలు కల్పిస్తుంది.

ఆయన రెండవ ఆలోచన, ఒకే AI-ఆధారిత సర్వీస్ డెస్క్ ద్వారా ప్రభుత్వ సేవలను సులభంగా పొందేలా చేయడం. ప్రతిపాదిత విధానం ప్రకారం, ప్రజలు అభ్యర్థనలను సమర్పించి, పత్రాలను ఒక్కసారి మాత్రమే అప్‌లోడ్ చేయవచ్చు. ఆ తర్వాత ఒక ఏఐ ఏజెంట్ ప్రతి అభ్యర్థనను ట్రాక్ చేసి, దానిని సరైన విభాగానికి పంపగలదు.

దీనివల్ల ప్రభుత్వ సేవలను పొందడానికి ప్రజలు వేర్వేరు కార్యాలయాలను సందర్శించడం లేదా అనేక ప్రత్యేక ప్రక్రియలను అనుసరించాల్సిన అవసరాన్ని ఈ వ్యవస్థ తగ్గిస్తుంది. ఈ రెండు ఆలోచనలు కూడా, విద్యార్థులు ఆచరణాత్మక అనుభవం తోపాటుపౌరులకు ప్రభుత్వ సేవలను సులభతరం చేయడంలో ఏఐ వినియోగాన్ని వివరించేవి. 

తేజస్‌ నేపథ్యం..
సుదర్శన్ ఒక వ్యవస్థాపకుడు. ఆయన అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పనిచేసే విన్సెన్ ల్యాబ్స్ అనే స్టార్టప్‌ను స్థాపించారు. ఈ కంపెనీని ప్రారంభించడానికి ముందు, ఆయన KPMG ఇండియాలో పనిచేశారు. అలాగే ఫ్యాన్‌పిట్ అనే ఈవెంట్స్ అండ్‌ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించారు. ఆవేళ ప్రదానమంత్రి చెన్నై పర్యటన సందర్భంగా ఆయనతో సంభాషించే ఛాన్స్‌ కొట్టేసిన 17 మంది స్టార్టప్‌ వ్యవస్థాపకులలో తేజస్‌ ఒకరు. 

వాళ్లంతా ఆ సంభాషణలో తన పని జీవిత సమస్యలను పరిష్కరించడంలో ఏఐ ఏవిధంగా ఉపయోగపడగలదో చర్చించారు. కాగా, తేజస్‌ లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. తాను 2017లో తన పాఠశాల విద్యార్థుల నాయకుల ఎన్నికల సమయంలో అభ్యసాన్ని మెరుగుపరుచుకోవడం కోసం గూగుల్‌ క్లాస్‌రూమ్‌ని ఉపయోగించాలని ప్రతిపాదించా. ఆ తర్వాత దాదాపు తొమ్మిదేళ్ల అనంతరం విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఆచరణాత్మక సమస్యలను ఎలా పరిష్కరించవచ్చనే దానిపై మోదీతో చర్చించే అవకాశం పొందానంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ తేజస్‌ పాఠశాల ఎన్నికల ప్రసంగం నుంచి ఏకంగా ప్రధాని మోదీతో ముఖాముఖి మాట్లాడే రేంజ్‌కి చేరుకోవడం నిజంగా అభినందనీయం, యువతకు స్ఫూర్తి కూడా. 

 

ఇదీ చదవండి: భారతదేశపు తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్త..! కానీ ఆ డాక్టర్‌..

 

 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)