తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?
Breaking News
దీపికాకు మద్దతుగా దృశ్యం3 నటి.. 8గంటలే పని?
Published on Thu, 10/15/2026 - 19:08
సినిమా షూటింగ్ సెట్లో రోజుకు 8 గంటల పని విధానం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె గతంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రోజుకు 8 గంటల పని విధానానికి సంబంధించి విభేదాలే ఆమె నిర్ణయానికి కారణమంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై ‘దృశ్యం 3’ నటి ఇషితా దత్తా స్పందించారు. దీపికా పదుకొణెకు మద్దతుగా నిలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అడగడంలో తప్పేముంది?
రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయాలన్న దీపికా డిమాండ్ సరైనదేనని ఇషితా దత్తా అభిప్రాయపడ్డారు. ఒక నటుడు రోజుకు 8 గంటలు పనిచేయాలా? అంతకంటే ఎక్కువ సమయం కేటాయించాలా? అనేది వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్మాణ సంస్థలు అంగీకరించవచ్చని, లేదంటే తమకు సాధ్యం కాదని చెప్పవచ్చని అన్నారు. అయితే సరైన పని వేళలు కావాలని అడిగినంత మాత్రాన వారిని తప్పుపట్టడం, విమర్శించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.
తల్లయ్యాక పరిస్థితి మారింది!
గతంలో తాను కూడా చాలా సందర్భాల్లో ఎక్కువ గంటలు పనిచేసినట్లు ఇషితా వెల్లడించారు. అయితే తల్లి అయిన తర్వాత తన పరిస్థితిని నిర్మాతలు అర్థం చేసుకున్నారని తెలిపారు. షూటింగ్ పూర్తయిన వెంటనే వీలైనంత త్వరగా తనను ఇంటికి పంపించేవారని చెప్పారు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: రజనీకాంత్ సినిమా.. నటి పూర్ణకు భారీ కటౌట్..!)
Tags : 1