తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?
Breaking News
రూ. లక్షతో దరఖాస్తుకు చాన్స్
Published on Thu, 10/15/2026 - 16:30
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)ల పబ్లిక్ ఇష్యూ మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు ప్రతిపాదించింది. ఎస్ఎంఈ ఐపీవో మార్గదర్శకాలను పటిష్టపరిచే లక్ష్యంతో పలు సవరణలకు తెరతీస్తూ కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది.
ఇన్వెస్టర్లకు మరింత రక్షణ కల్పించడం, కీలక నియంత్రణలను అనుసంధానించడం సహా.. మెయిన్‌బోర్డ్‌లో చోటుసాధించగల ఇష్యూలకు సైతం నిబంధనలలో సవరణలను చేపట్టనుంది. దీనిలో భాగంగా ఐపీవో కనీస దరఖాస్తు విలువను ప్రస్తుత రూ. 2 లక్షల నుంచి రూ. లక్షకు తగ్గించనుంది. అలాటీస్ కనీస సంఖ్యను 200 నుంచి 500కు పెంచనుంది. మెయిన్‌బోర్డు తరహాలో ఎస్ఎంఈ లిస్టెడ్ కంపెనీలకు తప్పనిసరిగా అమలు చేస్తున్న మార్కెట్ మేకింగ్ నిబంధనలను ఎత్తివేయనుంది.
మార్కెట్ విలువపై..
మెయిన్బోర్డులోకి ప్రవేశించాలనుకునే చిన్న కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లోనూ మార్పులకు ప్రతిపాదించింది. వీటి ప్రకారం స్వచ్ఛందంగా మైగ్రేట్ కావాలనుకునే లిస్టెడ్ ఎస్ఎంఈల మార్కెట్ విలువ రూ. 1000 కోట్ల నుంచి రూ. 4,000 కోట్ల మధ్య ఉండాలి. తప్పనిసరి మెయిన్‌బోర్డు ఎంట్రీకి మార్కెట్ క్యాప్ రూ. 4,000 కోట్లు అధిగమించాలి. వీటన్నిటికీ ఇతర అర్హతా సంబంధ నిబంధనలు వర్తిస్తాయి. ఇక వార్షిక సగటు నిర్వహణా లాభం ప్రస్తుత రూ. కోటి నుంచి రూ. 3 కోట్లకు పెంచింది. ఇది గడచిన మూడేళ్లలో కనీసం రెండేళ్లయినా సాధించి ఉండాలి. ఇలాకాని కంపెనీలు ప్రత్యామ్నాయంగా ఇష్యూలో 75 శాతాన్ని అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్)కు కేటాయించాలి. ఇటీవల కొంతకాలంగా ఇష్యూలు, ఇన్వెస్టర్ల సంఖ్య, నిధుల సమీకరణకుతోడు.. మార్కెట్ విలువ, మైగ్రేట్ అవుతున్న కంపెనీల సంఖ్య భారీగా పెరగడంతో సెబీ మార్గదర్శకాలను సవరించేందుకు నడుం బిగించింది.
ఎస్ఎంఈల జోరు
ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌లను ప్రవేశపెట్టాక 2026 జూలై31 వరకూ 1,496 సంస్థలు ద్వారా లిస్టయ్యాయి. కొన్ని మెయిన్బోర్డులోకి చేరాయి కూడా. ఇవన్నీ ఉమ్మడిగా రూ. 40,222 కోట్లు సమీకరించాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం కనీస విలువ రూ. 25,000కాగా.. కనీసం 4 లాట్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీంతో మరింతమంది ఇన్వెస్టర్లు ఎస్ఎంఈ ఐపీవోలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. అంతేకాకుండా అలాటీస్ సంఖ్యను సైతం పెంచడంతో అధిక సంఖ్యలో ఇన్వెస్టర్లకు షేర్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది. వీటితోపాటు ట్రేడింగ్ లాట్, ఫ్లోర్ ధర ఆధారంగా ఐపీవో ధర నిర్ణయం, నిధుల వినియోగం తదితర పలు నిబంధనల్లో సవరణలకు సైతం సెబీ ప్రతిపాదించింది.
ఇదీ చదవండి: బీఎస్-7 వాహనాలపై కీలక అప్డేట్!
Tags : 1