Breaking News

బీఎస్‌-7 వాహనాలపై కీలక అప్డేట్!

Published on Thu, 10/15/2026 - 14:52

న్యూఢిల్లీ: దేశంలో వాహన కాలుష్యాన్ని నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల వాహనాలకు (ఎం1 కేటగిరీ) 2029 ఏప్రిల్‌ 1 నుంచి అత్యంత కఠినమైన ‘భారత్‌ స్టేజ్‌- VII’ (బీఎస్‌–7) ఉద్గార ప్రమాణాలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ ముసాయిదా నోటిఫికేషన్‌పై 30 రోజుల పాటు ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. ప్రస్తుతం దేశంలో 2020 ఏప్రిల్‌ నుంచి ‘బీఎస్‌–6’ నిబంధనలు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

మూడు దశల్లో కఠిన నిబంధనలు
ప్రస్తుత బీఎస్‌-6 ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తూ బీఎస్‌-7 నిబంధనలను మూడు దశల్లో (2029, 2031, 2035) అమలు చేయాలని ప్రతిపాదించారు. తొలి దశ (ఏప్రిల్‌ 2029) నుంచి తొలి దశలో కార్ల ఎగ్జాస్ట్, ఉద్గారాలతో పాటు ఇంధన, ఎలక్ట్రిక్‌ వినియోగం, ఈవీ బ్యాటరీ మన్నికపై  నూతన నిబంధనలు అమలులోకి వస్తాయి. రెండో దశ (ఏప్రిల్‌ 2031)లో టైర్ల అరుగుదల, బ్రేక్‌ ప్యాడ్ల ఉద్గారాలపై కట్టడి మొదలవుతుంది. ఈవీలకు కిలోమీటరుకు 3 మిల్లీగ్రాములు, ఇతర వాహనాలకు 7 మిల్లీగ్రాములకు మించి బ్రేక్‌ డస్ట్‌ ఉండకూడదు. మూడో దశ (ఏప్రిల్‌ 2035) నుంచి అన్ని రకాల ఇంజిన్లు, ఈవీ వాహనాలకు బ్రేక్‌ కాలుష్య పరిమితిని కిలోమీటరుకు 3 మిల్లీగ్రాములకు తగ్గించనున్నారు.

రోడ్డుపై రన్నింగ్‌లోనూ తనిఖీలు! 
ఈ ప్రతిపాదన ప్రకారం ఇకపై కేవలం ల్యాబ్‌లలోనే కార్లను పరీక్షించడమే కాకుండా, రోడ్డుపై వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు వెలువడే కాలుష్యాన్ని కొలిచే ‘రియల్‌ వరల్డ్‌ డ్రైవింగ్‌ ఎమిషన్‌’ (ఆర్‌డీఆ) పరీక్షలు తప్పనిసరి. ఇకపై కేవలం ల్యాబ్‌లలోనే కార్లను పరీక్షించడమే కాకుండా, రోడ్డుపై వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు వెలువడే కాలుష్యాన్ని కొలిచే ‘రియల్‌ వరల్డ్‌ డ్రైవింగ్‌ ఎమిషన్‌’ (ఆర్‌డీఈ) పరీక్షలు తప్పనిసరి. వాహనంలోనే ఉద్గారాలను పర్యవేక్షించే ఆన్‌–బోర్డ్‌ మానిటరింగ్‌ (ఓబీఎం) సిస్టమ్‌లు ఉంటాయి. ఇవి పరిమితికి 2.5 రెట్లు మించి కాలుష్యం వస్తే వెంటనే గుర్తిస్తాయి. ప్రతి వాహనానికి 8 ఏళ్లు లేదా 1,60,000 కి.మీల వరకు ఉద్గారాల గ్యారెంటీ ఉండాలి. గరిష్టంగా 10 ఏళ్లు లేదా 2,00,000 కి.మీల వరకు దీన్ని పర్యవేక్షిస్తారు.

కొనుగోలుదారులకు వెహికల్‌ పాస్‌పోర్ట్‌
వాహనాల ఉద్గారాలు, ఇంధన వినియోగం, బ్యాటరీ స్థితిగతులను వినియోగదారులు నేరుగా చూసుకునేందుకు ‘ఎని్వరాన్‌మెంటల్‌ వెహికల్‌ పాస్‌పోర్ట్‌’ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. వాహనంలో ఉన్న డిస్‌ప్లే స్క్రీన్‌ ద్వారా ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అంతేకాకుండా ‘జియోఫెన్సింగ్‌’ సాంకేతికత ఉన్న పెట్రోల్, డీజిల్‌ వాహనాలను ‘బీఎస్‌–7–జీ’ కేటగిరీగా వర్గీకరిస్తారు.  

ఈవీ బ్యాటరీలపై తొలిసారిగా ఆంక్షలు
ఇప్పటివరకు కేవలం పెట్రోల్, డీజిల్‌ వాహనాలకే పరిమితమైన ఉద్గార నిబంధనలను తొలిసారిగా ఎలక్ట్రిక్, ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ వాహనాలకూ విస్తరిస్తున్నారు. ఈవీ బ్యాటరీ మన్నిక తొలి అయిదేళ్లు లేదా 1,00,000 కి.మీల వరకు కనీసం 75 శాతం పనితీరును కలిగి ఉండాలి. తదుపరి ఎనిమిదేళ్లు లేదా 1,60,000 కి.మీల వరకు కనీసం 67 శాతం పనితీరును నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)