Breaking News

ఏఐ పాటలకు యూట్యూబ్‌లో ప్రత్యేక లేబుల్‌

Published on Thu, 10/15/2026 - 13:05

సంగీత విభాగంలో కృత్రిమ మేధ (జనరేటివ్‌ ఏఐ) విప్లవాత్మక మార్పులు తెస్తున్న తరుణంలో అసలైన పాటలకు, ఏఐ సృష్టించిన మ్యూజిక్‌కు మధ్య వ్యత్యాసం గుర్తించడం శ్రోతలకు కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ కంటెంట్ రంగంలో పారదర్శకతను మరింత పెంచేందుకు ప్రముఖ వీడియో దిగ్గజం యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా జనరేటివ్ ఏఐ సాయంతో తయారైన పాటలను స్పష్టంగా గుర్తించేలా ప్రత్యేక లేబుల్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.

సంగీత ప్రియుల నుంచి వస్తున్న డిమాండ్లు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ ఈ విధానం తీసుకొస్తున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది. దీనిద్వారా ఒక పాటను కంపోజ్ చేయడంలో లేదా వోకల్స్ (గాత్రం) అందించడంలో ఏఐ మోడల్స్‌ను ఏ మేరకు వినియోగించారనే విషయం శ్రోతలకు సులభంగా అర్థమవుతుంది. తొలి విడతగా ఈ లేబులింగ్ ప్రక్రియను ‘యూట్యూబ్ మ్యూజిక్’ ప్లాట్‌ఫామ్‌పై ప్రారంభించగా త్వరలోనే ప్రధాన యూట్యూబ్ యాప్‌నకు కూడా విస్తరించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

అధికారిక భాగస్వాముల సహకారంతో గుర్తింపు

ఏఐ ద్వారా రూపుదిద్దుకున్న పాటలను గుర్తించేందుకు యూట్యూబ్ తన సొంత అత్యాధునిక డిటెక్షన్ టూల్స్‌తో పాటు మ్యూజిక్ పార్ట్‌నర్లు అందించే డిస్‌క్లోజర్స్ (సమాచారం)ను కూడా ఉపయోగిస్తోంది. ఏ పాటలైతే ప్రధానంగా జనరేటివ్ ఏఐ సహాయంతో రూపొందించబడ్డాయో వాటికి మ్యూజిక్ ప్లేయర్‌పైనే నేరుగా ఈ లేబుల్స్ కనిపిస్తాయని తెలిపింది.

కేవలం యూట్యూబ్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగానూ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఏఐ టెక్నాలజీ నియంత్రణపై దృష్టి సారిస్తున్నాయి. యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై, టైడల్ వంటి సంస్థలు కూడా ఏఐ మ్యూజిక్‌ను ట్యాగ్ చేయడానికి లేదా వేరుగా గుర్తించడానికి విధానాలను అమలు చేస్తున్నాయి. మరోవైపు రియా (RIAA), ఐఎఫ్‌పీఐ (IFPI), గ్రామీలు, సాగ్-అఫ్రా (SAG-AFTRA) వంటి ప్రముఖ అంతర్జాతీయ సంగీత సంస్థలు సైతం ఏఐ-జనరేటెడ్ లేదా ఏఐ-అసిస్టెడ్ లేబుల్స్ ఉండాలని వాదిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఇంట్లో మహారాణులు.. పెట్టుబడుల్లో ప్రేక్షకులు!

#

Tags : 1

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)