Breaking News

భారతదేశపు తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్త..! కానీ ఆ డాక్టర్‌..

Published on Thu, 10/15/2026 - 12:45

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దంపతులకు సంతాన సాఫల్యతను చేకూరుస్తున్న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) లేదా 'టెస్ట్ ట్యూబ్ బేబీ' విధానం వైద్య రంగంలోనే ఒక మహా విప్లవం. నేడు ఎంతో మంది చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్న ఈ సాంకేతికతకు భారతదేశంలో పునాది వేసిన చారిత్రాత్మక ఘట్టం ఎంతో ఆసక్తికరం, అంతే వేదనాభరితం. బ్రిటన్‌లో ప్రపంచపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించిన కేవలం 67 రోజులకే.. మన దేశంలోనూ అటువంటి అద్భుతాన్ని సృష్టించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు ఒక భారతీయ శాస్త్రవేత్త. 

ఆయనే దేశీయ ఐవీఎఫ్ పితామహుడు డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ్. భారత్‌లో వైద్య చరిత్ర సృష్టించిన 'దుర్గ'..1978 జూలై 25న బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్, డాక్టర్ పాట్రిక్ స్టెప్టోల కృషితో ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ 'లూయిస్ బ్రౌన్' జన్మించింది. ఆ చారిత్రాత్మక క్షణం మరువక ముందే.. సరిగ్గా అదే ఏడాది అక్టోబర్ 3న కోల్‌కతాలో డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ్ నేతృత్వంలోని బృందం సరికొత్త రికార్డు సృష్టించింది.

రెండో అద్భుతం..
ఐవీఎఫ్ సాంకేతికత ద్వారా భారతదేశపు మొట్టమొదటి, ప్రపంచంలోనే రెండవ టెస్ట్ ట్యూబ్ బేబీ అయిన కనుప్రియ అగర్వాల్ జన్మించినట్లు ఆయన ప్రకటించారు. ఆ పాపకు వారు 'దుర్గ' అని నామకరణం చేశారు. పరిమిత వనరులతోనే.. ఆ కాలంలో మన దేశంలో ఆధునిక వైద్య సదుపాయాలు, వనరులు ఎంతో పరిమితంగా ఉన్నప్పటికీ డాక్టర్ ముఖోపాధ్యాయ్ సాధించిన ఈ విజయం అంతర్జాతీయ వైద్య రంగాన్ని సైతం ఆకర్షించింది. 

కాలం కంటే ముందే.. అద్భుత ప్రయోగాలు.. డాక్టర్ ముఖోపాధ్యాయ్ ఆలోచనా విధానం ఆ కాలపు సాంకేతికత కంటే ఎంతో ముందుండేది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఐవీఎఫ్ కేంద్రాల్లో సర్వసాధారణంగా వాడుతున్న ఎన్నో పద్ధతులకు ఆయనే అప్పట్లో మార్గదర్శకత్వం వహించారు. గోనాడోట్రోపిన్ పద్ధతి.. మహిళల్లో అండాశయాలను ఉత్తేజ పరిచేందుకు ఆయన గోనాడోట్రోపిన్ హార్మోన్ ఆధారిత పద్ధతులను విజయవంతంగా ఉపయోగించారు.

ఎంబ్రియో క్రయోప్రిజర్వేషన్..
భవిష్యత్తు అవసరాల కోసం పిండాలను సురక్షితంగా గడ్డకట్టించే 'ఎంబ్రియో క్రయోప్రిజర్వేషన్' విధానాన్ని ఆయన ఆ కాలంలోనే ప్రయోగించి విజయం సాధించారు. అవమానాలు, అపనమ్మకాలు.. చివరికి విషాదాంతం..దేశం గర్వించదగ్గ అద్భుతాన్ని సాధించినప్పటికీ డాక్టర్ ముఖోపాధ్యాయ్‌కు స్వదేశంలో ఎదురైన చేదు అనుభవాలు వర్ణనాతీతం. 

ఆయన సమర్పించిన పరిశోధనా నివేదికలను, ఫలితాలను అప్పటి అధికారిక కమిటీ నమ్మదగనివిగా, అసంబద్ధమైనవిగా కొట్టిపారేసింది. తీవ్ర వృత్తిపరమైన ఒంటరితనం, నిరంతర అవమానాలు, అధికారుల వేధింపులు ఆయనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. ఈ ఒత్తిడి భరించలేక ఆయన ఆరోగ్యం క్షీణించి గుండెపోటుకు గురయ్యారు.

ఏక్ డాక్టర్ కీ మౌత్ పేరుతో సినిమా..
చివరికి సమాజం నుంచి  ఆశించిన గుర్తింపు లభించక, మనస్తాపంతో 1981 జూన్ 18న ఆయన ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఆయన జీవిత కథ ఆధారంగా 1990లో 'ఏక్ డాక్టర్ కీ మౌత్' అనే చలనచిత్రం కూడా రూపుదిద్దుకుంది. రెండు దశాబ్దాల తర్వాత దక్కిన గౌరవం.. డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ్ మరణించిన రెండు దశాబ్దాల తర్వాత గానీ ఆయన సాధించిన ఘనతను ఈ ప్రపంచం గుర్తించలేకపోయింది. 

సుదీర్ఘ పరిశీలనల అనంతరం, 2002లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఆయన సేవలను అధికారికంగా గుర్తించి, భారతదేశపు తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్త ఆయనేనని ప్రకటించింది. 2007లో ప్రతిష్టాత్మక 'డిక్షనరీ ఆఫ్ మెడికల్ బయోగ్రఫీ'లో ఆయనకు స్థానం కల్పించారు. ఐసీఎంఆర్ ఆయన పేరిట ప్రత్యేక పురస్కారాన్ని కూడా నెలకొల్పింది. నేడు ఐవీఎఫ్ కేంద్రాల ద్వారా ఎంతో మంది దంపతులు తల్లిదండ్రులుగా పొందుతున్న ఆనందం వెనుక.. ఆనాడు డాక్టర్ ముఖోపాధ్యాయ్ పడిన శ్రమ, త్యాగం దాగి ఉన్నాయి. వైద్య రంగంలో ఆయన నిలిపిన వెలుగులు ఎప్పటికీ చిరస్మరణీయం.. 
-పసుపులేటి వెంకటేశ్వరరావు.

 ఇదీ చదవండి: అతి వ్యాయామాలతో తస్మాత్‌ జాగ్రత్త..! హీరో పునీత్‌ ఆఖరి క్షణాలు నేర్పే గుణపాఠం ఇదే..

Videos

పెద్దాపురంలో టీడీపీ కార్యకర్త హుల్ చల్, కన్నీళ్లు పెట్టుకున్న సూరిబాబు రాజు

ఇంతన్నాడు అంతన్నాడు 10% ముష్టికి బానిసయ్యాడు

భారతరత్న అబ్దుల్ కలాం జయంతి.. వైఎస్ జగన్ భావోద్వేగ సందేశం..

భారత రాష్ట్రపతిని ఘోరంగా అవమానించిన చంద్రబాబు

గంభీర్ సీరియస్.. విండీస్ కెప్టెన్ విధ్వంసం షాకైన టీం ఇండియా

Jailer2 Review హిట్టా..? ఫ‌ట్టా..?

అల్లు అర్జున్ ఎంట్రీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి!

బంగారు గొలుసు కోసం స్నాచింగ్.. దొంగకు ఊహించని ట్విస్ట్..!

సీట్ల లెక్కలపై జనసేనలో అసంతృప్తి.. పవన్ పై కార్యకర్తల ఆగ్రహం?

ప్రేమకు హద్దులు లేవు.. లవర్ కోసం రష్యా నుంచి భారత్ కు

Photos

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)