తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?
Breaking News
హీరో పునీత్ ఆఖరి క్షణాలు..అది గుండెపోటు కాదు..! ఫ్యామిలీ డాక్టర్ వివరణ
Published on Thu, 10/15/2026 - 11:38
సుమారు ఐదేళ్ల క్రితం ఇదే సమయంలో పునీత్ రాజక్ కుమార్ అందర్నీ శోకసంద్రంలోకి నెట్టి వెళ్లిపోయారు. యావత్తు కర్ణాటక రాష్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింద. కేవలం 46 ఏళ్ల వయసులో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు జిమ్‌లో వ్యాయామం చేశాక కుప్పకూలిపోవడం దేశవ్యాప్తంగా అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. సరిగ్గా ఇదే సమయంలో అక్టోబర్ 29, 2021 గుండెపోటుతో మరణించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అయితే ఆవేళ ఆయనకు చికిత్స అందించిన వైద్యుడు డాక్టర్ రమణ రావు ఆయన మరణించింది గుండెపోటు వల్ల కాదంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. అంతేగాదు ఆయన కూడా పునీత్‌రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోయానంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆవేళ ఆ చివర నిమిషంలో పునీత్‌కి ఏమైందో సవివరంగా తెలిపారు.
అసలు ఆవేళ ఏం జరిగిందంటే..ఆయన వైద్యుడి కథనం ప్రకారం..ఆ రోజు పునీత్ చేసిన వ్యాయామం ఆయన రోజు చేసే ఫిట్నెస్ దినచర్యకు భిన్నంగా ఉంది. పునీత్ ఆ రోజు తొలిసారిగా కిక్‌బాక్సింగ్ ప్రయత్నించారని, సుమారు గంటన్నరపాటు దాని కోసం శ్రమించారని అన్నారు. ఆ తదనంతరమే ఆయన అస్వస్థతకు గురై వైద్యుడిని సంప్రదించారని సమాచారం. అయితే ఆయన ఆస్పత్రికి చేరుకోవడానికి సరిగ్గా నిమిషం ముందే ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని వెల్లడించారు.
అలాగే డాక్టర్ రమణరావు తనకు పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. తాను పునీత్‌ని అప్పు అని ప్రేమగా పిలుస్తానని చెప్పారు. అతడు చాలా మంచి వ్యక్తి అని, తన కొడుకు లాంటి వాడని అన్నారు. తన రెండో కుమారుడు, పునీత్ మంచి స్నేహితులని, తరుచుగా కలిసి ఆడుకునేవారని చెప్పారు.
తన వృత్తి జీవితంలో ఎన్నో విషాదాలు చూశాను. కొన్ని తన మనసుపై తీవ్రైమన ముద్ర వేసిన ఘటనలు ఉన్నాయని, వాటిని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. అలాంటి వాటిలో అప్పు మరణం కూడా ఒకటని అన్నారు. అలాగే పునీత్ ఆఖరి నిమిషాలను గుర్తు చేసుకుంటూ డాక్టర్ ఇలా చెప్పుకొచ్చారు. తీవ్రమైన వ్యాయామం తర్వాత పునీత్ విపరీతమైన చెమటలతో తన క్లినిక్‌కు వచ్చారు. ఆ చెమట విపరీతంగా ఉండటం గమనించా.
అసలేం జరిగిందని పునీత్‌ని అడగగా..తాను జిమ్‌కు వెళ్లానని, అక్కడ గంటన్నర పాటు కిక్‌బాక్సింగ్ చేశానని చెప్పాడు. ఆ వేళే కొత్తగా ఆ వ్యాయామాన్ని ప్రయత్నించాడు, పైగా తీవ్ర అలసటకు లోనయ్యాడు. అదీగాక అతడి చెమటను చూస్తే తీవ్రత అర్థమై తక్షణమే ఈసీజీ తీయించాను. అందులో గుండె తీవ్రమైన ఒత్తిడికి లోనై ఉన్నట్లు తేలింది. "తక్షణమే మందులు ఇచ్చాను, వెంటనే ఆస్పత్రికి తరలించాం. ఆయన తన సొంత కారులోనే వెళ్లాడు.
అప్పటికి మాతో మాట్లాడుతున్నాడు. అయితే తాను అతన్ని తన భార్య అశ్విని ఒడిలో తల పెట్టుకుని విశ్రాంతి తీసుకోమని సూచించాను. డ్రైవర్‌ను త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లమని కోరాను. అదే సమయంలో డాక్టర్ రంగ నాయక్ అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆస్పత్రి చేరకు మునుపే ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. చెప్పాలంటే ఆస్పత్రిలోకి ప్రవేశించే లోపు కథ అయిపోయింది. అక్కడికి ఆస్పత్రి ప్రోటోకాల్‌ని అనుసరించి చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాం, కానీ ఫలితం శూన్యం." అని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు డాక్టర్ రమణరావు. ఆ క్షణం తనకు తన సొంత కొడుకునే కోల్పోయినంత బాధ వచ్చిందన్నారు.
ఈ ఉదంతం నేర్పే పాఠం..
వ్యాయామం ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ వార్మ్-అప్, చివర్లో కూల్-డౌన్ తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.
అతిగా లేదా తీవ్రమైన ఒత్తిడికి గురిచేసే వ్యాయామాలు చేసే ముందు ఫిట్నెస్ నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలి. ఒకవేళ వర్కౌట్ల తర్వాత ఈ కింది లక్షణాలు కనిపిస్తే తక్షనమే వైద్యుడిని సంప్రదించాలి.
ఛాతీలో నొప్పి, మంట, లేదా బిగుతుగా అనిపించడం.
మెడ, దవడ, వెన్ను లేదా ఎడమ చేతికి నొప్పి పాకడం.
విపరీతంగా చెమటలు పట్టడం మరియు ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం.
తల తిరగడం, కళ్ళు తిరగడం లేదా వాంతులు వచ్చేలా అనిపించడం.
కొత్తగా వ్యాయామాలు ప్రయత్నించే ముందు మీ శారీరక స్థితికి అనుకూలమా కాదో వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
ఇదీ చదవండి: విదేశీ మేయర్.. దేశీ ఆటో! నార్వే మేయర్ భారత్ టూర్‌కి షాకవ్వాల్సిందే
Tags : 1