ఫలితం కంటే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి!

Published on Thu, 10/15/2026 - 00:46

మా పాప ఆరోతరగతి. చిన్నప్పటి నుంచి చదువులో టాపరే. మేము ఫస్ట్‌ రావాలని ఎప్పుడూ ఒత్తిడి చేయం. తనే చదువును సీరియస్‌గా తీసుకుని ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ రావాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ మధ్య అర్ధరాత్రి ఒక్కసారిగా లేచి, ‘‘నాకు క్లాస్‌రూమ్‌ గుర్తొస్తోంది. టీచర్‌ చెప్పిన పాఠాలు గుర్తొస్తున్నాయి. ఇవన్నీ గుర్తొస్తుండటంతో నిద్ర రావడం లేదు’’ అంటూ ఏడుస్తోంది. తరచు ఇలా జరుగుతోంది. అంత బాగా చదివే అమ్మాయి ఇలా అనేసరికి మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీనివెనుక ఏదైనా మానసిక సమస్య ఉందా? 
–  రమేష్, వరంగల్‌

చిన్నప్పటి నుంచి చదువులో టాప్‌గా ఉంటూ, చదవడం ఇష్టపడే పిల్లల్లో ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా కంగారుపడటం సహజమే. ప్రాథమికంగా దీన్ని అకాడమిక్‌ యాంగై్జటీ, పర్ఫెక్షనిజం వల్ల ఏర్పడుతున్న ఒత్తిడిగా భావించవచ్చు. మీ అమ్మాయిపై బయట నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోయినా, ‘‘నేను ఎప్పుడూ క్లాస్‌లో ఫస్ట్‌ రావాలి’’ అనే పెద్ద బాధ్యతను తనకు తానే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 

ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు ఫస్ట్‌ ర్యాంక్‌ వస్తేనే విజయం, రాకపోతే తాను విఫలమైనట్లు భావించడం. తన ప్రతిభను, తన విలువను కూడా మార్కులు, ర్యాంకులతో ముడిపెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ అమ్మాయిలో కొన్ని పర్ఫెక్షనిస్టిక్‌ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఏరోజు హోంవర్క్‌ను ఆరోజే పూర్తిచేయాలి, అనుకున్న సిలబస్‌ మొత్తం చదివిన తర్వాతే పడుకోవాలి, ఏదీ మిగలకూడదు అనుకోవడం మంచి అలవాటే. 

కానీ ‘‘అన్నీ పర్ఫెక్ట్‌గా జరగాల్సిందే’’ అనే స్థాయికి వెళ్లినప్పుడు అదే అలవాటు మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. మనం ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు, ముఖ్యంగా చదివిన విషయాలను నిద్ర సమయంలో మెదడు మళ్లీ ప్రాసెస్‌ చేసి జ్ఞాపకాల్లో స్థిరపరుస్తుంది. పిల్లల్లో అప్పుడప్పుడు పగటిపూట జరిగిన విషయాలు కలల్లోకి రావడం, నిద్రలో మాట్లాడటం లేదా కలవరించడం కూడా కనిపించవచ్చు. 

అవి మాత్రమే ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మీ అమ్మాయి విషయంలో ఇది కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. శరీరం నిద్రలోకి వెళ్లినా, మెదడు మాత్రం చదువు, క్లాస్, ర్యాంకుల గురించి ఇంకా అప్రమత్తంగానే ఉండవచ్చు. ఆ సమయంలో ఆలోచనలు వరుసగా రావడం వల్ల తిరిగి నిద్రపట్టక భయపడటం, ఏడవడం జరగవచ్చు. 

ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు పడుకోవడానికి కనీసం గంట ముందు నుంచే పుస్తకాలు, హోంవర్క్‌ పక్కన పెట్టే అలవాటు చేయండి. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడటం, తేలికపాటి కథల పుస్తకం చదవడం, ప్రశాంతమైన సంగీతం వినడం, ధ్యానం లేదా శ్వాసపై దృష్టి పెట్టే చిన్న రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజులు చేయడం ఉపయోగపడతాయి. 

అన్నింటికంటే ముఖ్యంగా, ఆమె సాధించిన ఫలితం కంటే ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకోండి. ప్రతిసారీ ఫస్ట్‌ రావడం పూర్తిగా మన చేతుల్లో ఉండదని, దానిగురించి ఆందోళన పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలి. మార్కులు, ర్యాంకులతో ఆమె విలువను నిర్ణయించలేమని, ఫస్ట్‌ వచ్చినా రాకపోయినా ఆమెపై మీ ప్రేమలో ఎలాంటి మార్పూ ఉండదనే భరోసా ఇవ్వాలి. ఈ సూచనలను పాటించడం ద్వారా సమస్య తగ్గే అవకాశం ఉంది.

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, 
సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)