16 సంస్థలపై సైబర్ దాడులు

Published on Wed, 10/14/2026 - 12:34

దక్షిణ కొరియాలోని ఆర్థిక రంగాన్ని భారీ హ్యాకింగ్ సైబర్ దాడి వణికించింది. దేశంలోని మొత్తం 16 ఆర్థిక సంస్థలపై హ్యాకింగ్ దాడులు జరిగినట్లు ఆ దేశ ఆర్థిక రంగ నియంత్రణ సంస్థ ‘ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్’ (ఎఫ్‌ఎస్‌సీ) అధికారికంగా వెల్లడించింది. ఈ హ్యాకింగ్ దాడులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఏమైనా ఉపయోగించారా అనే కోణంలో ఆర్థిక, భద్రతా అధికారులు విచారణ వేగవంతం చేశారు.

మారుతున్న సాంకేతికతతో ఏఐ ఆధారిత సైబర్ దాడులు పెరిగే ముప్పు ఉండటంతో ఎఫ్‌ఎస్‌సీ ఈ  అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. బాధ్యులైన హ్యాకర్ల ముఠాను గుర్తించేందుకు, డేటా చోరీ తీరును విశ్లేషించేందుకు నిపుణులు ముమ్మరంగా పని చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సైబర్ ప్రమాదాలను త్వరితగతిన పసిగట్టేందుకు, ఉమ్మడి ప్రతిస్పందన చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ ప్రకటించింది. ఈ దాడుల వల్ల కంపెనీలు ఏమేరకు ప్రభావితం చెందాయనే అంశాలను మాత్రం ఎఫ్‌ఎస్‌సీ వెల్లడించలేదు.

అంతేకాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థిక సంస్థల్లో భద్రతా తనిఖీలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. డిజిటల్ బ్యాంకింగ్, సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడే ఆర్థిక రంగంపై జరిగిన ఈ ఊహించని దాడి ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ అవసరాన్ని మరోసారి నొక్కిచెప్పింది.

ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్‌.. ఇదే మంచి ఛాన్స్‌!

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)