భారత్‌ భవిష్యత్తుకు సెమీకండక్టర్లు కీలకం

Published on Wed, 10/14/2026 - 04:14

న్యూఢిల్లీ: భారతదేశ భవిష్యత్తుకు సెమీకండక్టర్లు కీలకంగా ఉంటాయని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించేందుకు సర్వసన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ప్రతిభావంతుల లభ్యత, దేశీయంగా అతి పెద్ద మార్కెట్, అంతర్జాతీయంగా భాగస్వామ్యాలు కుదుర్చుకునే సత్తాలాంటి అంశాలు  దేశానికి సానుకూలంగా ఉన్నాయని వివరించారు. 2026 బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 

దేశీయ వినియోగ అవసరాలను తీర్చే ముఖ్యమైన పరిశ్రమలో అగ్రగామిగా నిల్చేందుకు 160 ఏళ్ల టాటా గ్రూప్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చంద్రశేఖరన్‌ చెప్పారు. సెమీకండక్టర్ల వ్యవస్థను నిర్మించడంలో భాగస్వామ్యాలు చాలా ప్రధాన పాత్ర పోషించనున్నందున.. టెక్నాలజీల కోసం గ్లోబల్‌ దిగ్గజాలతో భారత్‌ చేతులు కలపాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అదే సమయంలో విద్యుత్‌ అవసరాలపై కూడా ఒక కన్నేసి ఉంచాలని పేర్కొన్నారు. 

టాటా గ్రూప్‌లో భాగమైన టాటా ఎలక్ట్రానిక్స్‌ సంస్థ రూ. 91,000 కోట్ల పెట్టుబడులతో గుజరాత్‌లోని ధొలెరాలో సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం తైవాన్‌కి చెందిన పవర్‌చిప్‌ సెమీకండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కార్పొరేషన్‌ (పీఎస్‌ఎంసీ)తో జట్టు కట్టింది. వాహనాలు, మొబైల్‌ పరికరాలు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ మొదలైన వాటిలో ఉపయోగించే చిప్‌లను ఈ ప్లాంటులో తయారు చేయనున్నారు. టాటా గ్రూప్‌ అటు అస్సాంలో రూ. 27,000 కోట్లతో సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది.  

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)