Breaking News

చీర కట్టుకుంటే తెలివి తక్కువా?.. సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

Published on Sun, 10/11/2026 - 17:51

చీర అనేది సాంప్రదాయ వస్త్రధారణ కావచ్చు, కానీ.. అది ఒక మహిళ తెలివితేటలు, సామర్థ్యాలను నిర్ణయిస్తుందా?. ఈ విషయంపై రాజ్యసభ సభ్యురాలు, రచయిత్రి సుధా మూర్తి స్పందించారు.

మహిళలు చీర కట్టుకుంటే తక్కువగా చూడటం, వారికి ఇంగ్లీష్ రాదని లేదా వృత్తిపరమైన నైపుణ్యాలు తక్కువగా ఉంటాయని భావించడం సరైన పద్ధతి కాదని సుధా మూర్తి పేర్కొన్నారు. ఒక వ్యక్తి తెలివితేటలను, జ్ఞానాన్ని వారు ధరించే దుస్తులను బట్టి అంచనా వేయకూడదని ఆమె స్పష్టం చేశారు. చీర కట్టుకున్న మహిళలు కూడా కార్పొరేట్ రంగంలో ఆత్మవిశ్వాసంతో రాణించగలరని అన్నారు. ఇటీవల ఇన్‌ఫ్లుయెన్సర్ ఐశ్వర్య డీకేఎస్ హెగ్డేతో జరిగిన సంభాషణలో.. సుధా మూర్తి ఈ విషయాలను వెల్లడించారు.

ప్రతిభను నిరూపించుకోవాలి
మహిళలు స్మార్ట్‌గా, శక్తివంతంగా కనిపించాలంటే పాశ్చాత్య దుస్తులు లేదా సూట్లు మాత్రమే ధరించాలనే అభిప్రాయాన్ని ఆమె ప్రశ్నించారు. మహిళలు చీరలు ధరించి కూడా పెద్ద కంపెనీల సమావేశాల్లో, బోర్డ్‌రూమ్‌లలో తమ ప్రతిభను నిరూపించుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

తాను చీర ధరించి విమానాశ్రయాలకు వెళ్లినప్పుడు కొందరు తనను 'బెహన్‌జీ' అని పిలిచేవారని సుధా మూర్తి గుర్తుచేసుకున్నారు. చీర కట్టుకున్నందుకు తనకు ఇంగ్లీష్ సరిగా రాదని, పరిజ్ఞానం తక్కువని, ఉన్నత వర్గాల జీవనశైలి గురించి తెలియదని కొందరు భావించినట్లు ఆమె తెలిపారు.

అయితే.. ఒక వ్యక్తి జ్ఞానం, సామర్థ్యాలకు వారు ధరించే దుస్తులకు ఎలాంటి సంబంధం లేదని సుధా మూర్తి అన్నారు. తాను ఎలాంటి దుస్తులు ధరించినా.. తన జ్ఞానం మారదని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో చీరకు ప్రత్యేకమైన స్థానం ఉందని, అది ఎప్పటికీ హుందాగా కనిపించే దుస్తుల్లో ఒకటని అన్నారు.

సాధారణంగా కార్పొరేట్ కార్యాలయాల్లో ఫార్మల్ దుస్తులు, సూట్లు ధరించేవారిని ఎక్కువ ప్రొఫెషనల్‌గా చూస్తుంటారు. కానీ.. సంప్రదాయ దుస్తులు ధరించే మహిళలకు కూడా అదే గౌరవం, గుర్తింపు ఇవ్వాలని సుధా మూర్తి అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: రైల్వే గైడ్‌లైన్స్.. ట్రైన్‌లో వీరికి టికెట్ అవసరం లేదు!

సోషల్ మీడియాలో ప్రశంసలు
సుధా మూర్తి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలువురు సానుకూలంగా స్పందించారు. దుస్తులను బట్టి ఒక వ్యక్తి తెలివితేటలను లేదా సామర్థ్యాలను అంచనా వేయకూడదని ఆమె చెప్పిన మాటలను ప్రశంసించారు. నిజమైన ప్రతిభ అనేది దుస్తుల్లో కాకుండా జ్ఞానం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంలో ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)