Breaking News

నవరాత్రి వైభవం.. నవదుర్గా రూపం

Published on Sun, 10/11/2026 - 16:23

‘దుర్గమ’మైన సంసార చక్రంలోని కష్టనష్టాలను దూరం చేసే జగద్రక్షకి దుర్గాదేవి. దుర్గముడనే రాక్షసుడు వేదాలను అపహరించి, యజ్ఞయాగాదులను నిలిపివేసి ప్రకృతిని అతలాకుతలం చేసిన వేళ.. ఆదిపరాశక్తి శాకంభరిగా ఆవిర్భవించి ఆ దానవుడిని సంహరించింది. దుర్గముడిని అంతమొందించిన ఆ తల్లే ‘దుర్గ’గా ఖ్యాతికెక్కింది. శక్తి ఆరాధనకు ప్రతీకలైన వసంత, ఆషాఢ, మాఘ నవరాత్రుల కంటే ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులకు విశేష ప్రాధాన్యం ఉంది. అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. భక్తులను అనుగ్రహించే అమ్మవారి నవదుర్గా స్వరూప విశేషాలివీ..

శైలపుత్రి (ఆరోగ్య ప్రదాయిని) 
పర్వతరాజైన హిమవంతుని పుత్రిక కనుక తొలి దుర్గ గా శైలపుత్రిని అర్చిస్తారు. నవరాత్రులలో మొదటిరో జు కొలిచే ఈ తల్లిని సేవించడం వల్ల సకల వ్యాధులు నశించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 

బ్రహ్మచారిణి (దీక్షా దక్షత) 
నారద మహర్షి ఉపదేశంతో పరమశివుడిని పతిగా పొ ందేందుకు ఆహార పానీయాలు విడిచి కఠోర తపస్సు ఆచరించిన స్వరూపమిది. ఆమె నిశ్చల తపస్సుకు పరవశించిన శంకరుడు ఆమెను అర్ధాంగిగా స్వీకరించి అర్ధనారీశ్వరుడయ్యాడు. ఈ తల్లిని ఆరాధిస్తే భక్తులలో ఆ త్మస్థైర్యం, ఏకాగ్రత, అంకితభావం రెట్టింపవుతాయి. 

చంద్రఘంట (సకల దుఃఖహారిణి) 
శిరస్సున అర్ధచంద్రుడిని ధరించి, స్వర్ణకాంతులతో విరాజిల్లే సింహవాహిని చంద్రఘంట. పది చేతుల్లో ధనుర్భాణాలు, త్రిశూలం, ఖడ్గం, గద వంటి ఆయుధాలతో దుష్టశిక్షణకు సిద్ధంగా ఉంటూనే.. కమలం, కమండలం, జపమాలలతో పాటు అభయ, వరద ముద్రలతో భక్తులపై కరుణ కురిపిస్తుంది. ఈమె ఆరాధనతో సమస్త బాధలు, భయాలు పటాపంచలవుతాయి. 

కూష్మాండ (తేజోమయి.. ఆయుర్దాయ ప్రదాత) 
బంగారు వర్ణపు కాంతులతో ప్రకాశించే అష్టభుజి కూష్మాండ దేవి. నాలుగు చేతులలో ఆయుధాలు, మూడింటిలో తామర, జపమాల, కమండలాన్ని ధరించిన ఈ తల్లి.. ఎనిమిదో చేతిలో అమృతకలశాన్ని కలిగి ఉంటుంది. ఆ దివ్య అమృతమే మానవాళికి సంపూర్ణ ఆయుష్షును, ఆనందాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. 

స్కందమాత (సంతాన సౌభాగ్యం) 
కుమారస్వామి (స్కందుడు)ని ఒడిలో లాలించే జగన్మాత రూపమిది. నాలుగు చేతులతో, ఒక చేత కలువ పువ్వు, మరో చేతులతో అభయ, వరద ముద్రలను కలిగి ఉంటుంది. ఈ దేవిని ఉపాసిస్తే సంతాన ప్రాప్తి కలగడంతో పాటు దివ్య తేజస్సు లభిస్తుంది. 

కాత్యాయని (మోక్ష ప్రదాయిని) 
కాత్యాయన మహర్షి తపస్సుకు మెచ్చి ఆయనకు పుత్రికగా జన్మించిన మూర్తి. చతుర్భుజిగా, సింహవాహినిగా సాక్షాత్కరించే కాత్యాయనీ దేవిని కొలిస్తే చతుర్విధ పురుషార్థాలు (ధర్మ, అర్థ, కామ, మోక్షాలు) సిద్ధిస్తాయి. జన్మజన్మాంతరాల పాపాలు సమసిపోతాయి. 

కాళరాత్రి (భయ వినాశిని – శుభంకరి) 
చిక్కటి నల్లని మేనిఛ్ఛాయ, విరబోసిన కురులు, త్రినేత్రాలతో రౌద్రరూపంలో దర్శనమిచ్చే తల్లి కాళరాత్రి. గార్దభవాహినిగా ఖడ్గం ధరించి ఉండే ఈమె నామస్మరణతో భూతప్రేతాలు పలాయనం చిత్తగిస్తాయి. చూడటానికి భయంకరంగా ఉన్నా నిరంతరం భక్తులకు శుభాలు చేకూర్చే మాత కావడంతో ‘శుభంకరి’గా పూజలందుకుంటోంది. 

మహాగౌరి (శాంతి స్వరూపిణి) 
శివుడి కోసం ఘోర తపస్సు చేసి మేనిఛాయ నల్లబడగా.. పరమేశ్వరుడు గంగాజలంతో అభిõÙకించి గౌరవర్ణాన్ని అనుగ్రహించిన రూపం మహాగౌరి. ఎనిమిదేళ్ల కన్యారూపంలో అర్చించే ఈ తల్లి భక్తుల జీవితాల్లోని చీకట్లను తొలగించి శాంతిసౌఖ్యాలను ప్రసాదిస్తుంది. 

సిద్ధిధాత్రి (అష్టసిద్ధుల అనుగ్రహం) 
కమలాసనురాలై శంఖ, చక్ర, గదా, పద్మాలను ధరించే తల్లి సిద్ధిధాత్రి. అణిమాది అష్టసిద్ధులను అనుగ్రహించే దివ్య స్వరూపం. సాధకుల ఇహపర సాధనలను పరిపూర్ణం చేసి మోక్షమార్గాన్ని సుగమం చేస్తుంది. 

రమావాణి సేవిత రాజరాజేశ్వరి (విజయ ప్రదాయిని) 
శరన్నవరాత్రుల ముగింపు రోజైన విజయదశమి నాడు అమ్మవారు రమావాణి సేవిత రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. లక్ష్మీ, సరస్వతులు ఇరువైపులా సేవలు చేస్తుండగా.. పాశాంకుశాలు, చెరకుగడ, వరద ముద్రలతో త్రిపురసుందరిగా వెలుగొందే ఈ పరాశక్తిని ఆరాధిస్తే ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు సిద్ధించి సకల కార్యాల్లో విజయం చేకూరుతుంది.

 

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)