Breaking News

రైల్వే గైడ్‌లైన్స్.. ట్రైన్‌లో వీరికి టికెట్ అవసరం లేదు!

Published on Sun, 10/11/2026 - 15:55

సాధారణంగా చాలామంది రైళ్లలో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారు. దీనికి కారణం తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు చేరుకోవచ్చు, కుటుంబంతో కలిసి ప్రయాణించవచ్చు. అయితే.. ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా చిన్న పిల్లల టికెట్ల విషయంలో చాలామందికి సందేహాలు వస్తుంటాయి. ఏ వయసు పిల్లలకు టికెట్ అవసరం లేదు?, ఎవరికి హాఫ్ టికెట్ తీసుకోవాలి?, పిల్లలకు ప్రత్యేక బెర్త్ కావాలంటే ఏం చేయాలి?, అనే విషయాలు ముందుగానే తెలుసుకుంటే ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదురుకావు.

రైల్వే నిబంధనల ప్రకారం.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ప్రత్యేక బెర్త్ తీసుకోకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. అంటే.. తల్లిదండ్రులు తమతో పాటు చిన్న పిల్లలను తీసుకెళ్లినప్పుడు వారి కోసం ప్రత్యేక టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే.. పిల్లలకు ప్రత్యేకంగా బెర్త్ కేటాయించరు. తల్లిదండ్రులతో పాటు ఒకే బెర్త్‌పై ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ చిన్నారికి ప్రత్యేక బెర్త్ కావాలనుకుంటే మాత్రం సంబంధిత టికెట్ ధర చెల్లించి బుక్ చేసుకోవాలి.

ఇక ఐదు సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో టికెట్ నిబంధనలు కొంత భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక బెర్త్ అవసరమా?, లేదా? అనే విషయాన్ని బట్టి టికెట్ బుకింగ్‌లో తేడా ఉంటుంది. ఈ వయసు పిల్లలకు ప్రత్యేక బెర్త్ కేటాయించరు, బెర్త్ కావాలనుకుంటే టికెట్ ధర చెల్లించి బుక్ చేసుకోవాలి.

పన్నెండు సంవత్సరాలు నిండిన పిల్లలకు సాధారణంగా పెద్దలతో సమానంగా టికెట్ తీసుకోవాలి. కాబట్టి.. రైలు టికెట్ బుక్ చేసుకునే ముందు పిల్లల వయసును సరిగ్గా నమోదు చేయడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు వయసు వివరాల్లో పొరపాట్లు జరిగితే ప్రయాణ సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

అలాగే, పిల్లలతో ప్రయాణించేటప్పుడు వారి వయసును ధ్రువీకరించడానికి అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవడం మంచిది. ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో పిల్లలకు ప్రత్యేక బెర్త్ బుక్ చేసుకుంటే వారు సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవడానికి వీలుంటుంది.

ఇదీ చదవండి: మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఈసారి ఎంతంటే?

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)