Breaking News

శాటిలైట్‌ టెక్నాలజీలో జియో దూకుడు.. ప్రీ-6జీ పేటెంట్ల దాఖలు

Published on Thu, 10/08/2026 - 20:51

న్యూఢిల్లీ: తదుపరి తరం టెలికాం సాంకేతికతలో భారత్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రిలయన్స్‌ జియో అడుగులు వేస్తోంది. స్వదేశీ శాటిలైట్‌ టెక్నాలజీ స్టాక్‌ను అభివృద్ధి చేయడంతో పాటు ప్రీ-6జీ సాంకేతికతకు సంబంధించి ఇప్పటికే పేటెంట్లను దాఖలు చేసినట్లు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌ ఆకాష్‌ అంబానీ తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా ఏఎన్‌ఐతో మాట్లాడిన ఆయన.. ఏఐ ఆధారిత వాయిస్‌, డేటా సేవలు, శాటిలైట్‌ కనెక్టివిటీ, 6జీ వంటి అధునాతన కమ్యూనికేషన్‌ టెక్నాలజీలపై జియో దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

శాటిలైట్‌ సాంకేతికతలో జియో సాధిస్తున్న పురోగతిని ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో ప్రదర్శిస్తున్నట్లు ఆకాష్‌ అంబానీ చెప్పారు. భారత్‌లోనే అభివృద్ధి చేసిన పూర్తి స్థాయి శాటిలైట్‌ టెక్నాలజీ స్టాక్‌ను రూపొందించడమే లక్ష్యమన్నారు. పరిశోధన, పేటెంట్లు, అంతర్జాతీయ ప్రమాణాల రూపకల్పన వంటి అంశాల్లో జియో చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు.

6జీ సాంకేతికతలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించాలన్న భారత్‌ లక్ష్యానికి జియో తన వంతు సహకారం అందించనుందని అంబానీ చెప్పారు. 6జీ పేటెంట్లలో 10 శాతం భారత్‌ నుంచి రావాలన్న లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ప్రయత్నంలో జియో కీలకంగా భాగస్వామి అవుతుందని పేర్కొన్నారు. 6జీ వాణిజ్య అభివృద్ధి దశకు చేరకముందే ప్రీ-6జీ సాంకేతికతకు సంబంధించి పేటెంట్ల దాఖలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.

వినియోగదారుల సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధస్సును విస్తృతంగా వినియోగించే అవకాశాలను జియో పరిశీలిస్తోంది. ఏఐ సాయంతో వాయిస్‌, డేటా సేవల్లో కొత్త ఆవిష్కరణలు తీసుకురావచ్చని అంబానీ అన్నారు. ఇవి దేశవ్యాప్తంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూర్చగలవని పేర్కొన్నారు.

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)