Breaking News

ఏఐతో అశ్లీల వీడియోలు.. కోర్టుకెక్కిన స్టార్‌ నటి కంగనా

Published on Thu, 10/08/2026 - 14:26

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న కొన్ని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌తో పాటు ఏఐ (AI) ద్వారా రూపొందించిన నకిలీ కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇలాంటి కంటెంట్‌ పరువుకు భంగం కలిగించడంతో పాటు వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అశ్లీల కంటెంట్‌తో పాటు..
కంగనా రనౌత్‌ ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గురువారం ఆమె తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇంటర్నెట్‌లో తనకు సంబంధించిన లైంగిక, అశ్లీల కంటెంట్‌తో పాటు.. తాను చెప్పని మాటలను చెప్పినట్లుగా చూపించే ఫేక్‌ న్యూస్‌, AI ద్వారా రూపొందించిన పోస్టులు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. కంగనా దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వికాస్‌ మహాజన్‌.. ప్రతివాదులకు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు వెల్లడించినట్లు సమాచారం.

విజయ్‌ దేవరకొండ కూడా..
ఇదే విచారణ సందర్భంగా హీరో విజయ్‌ దేవరకొండ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల కేసును కూడా ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించింది. విజయ్‌ వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది ఆరోపించారు. 
ఇప్పటికే పలువురుకి రక్షణ
వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన సెలబ్రిటీల్లో కంగనా ఒక్కరే కాదు. ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ తదితరులు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, పాడ్‌కాస్టర్‌ రాజ్‌ శమానీ, క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ కూడా ఇదే తరహాలో కోర్టును ఆశ్రయించారు. వీరిలో పలువురికి హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. 

(ఇదీ చదవండి: రూ.750తో పెళ్లి.. విషాదమే వెంటాడింది.. నానా భార్య ఎవరో తెలుసా?)
 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)