Breaking News

గిఫ్ట్‌ ఇస్తే వైద్యులు మందులు మారుస్తారా?

Published on Thu, 10/08/2026 - 12:58

ఔషధ కంపెనీలు అందించే బహుమతులు, నగదు ప్రయోజనాలు, ఆతిథ్యం వంటి ప్రోత్సాహకాలు వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లను ప్రభావితం చేస్తున్నాయా? ఇటువంటి అనైతిక మార్కెటింగ్‌ పద్ధతులను నియంత్రించేందుకు మరింత సమర్థవంతమైన చట్టబద్ధ వ్యవస్థ అవసరమా? అనే కీలక ప్రశ్నలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.

వైద్యుల స్వతంత్ర నిర్ణయాలపై ప్రభావం

ఫార్మా సంస్థల మార్కెటింగ్‌ విధానాలు ప్రజారోగ్యం, ఔషధాల ధరలు, వైద్యుల స్వతంత్ర నిర్ణయాలపై ‍ప్రభావం చూపుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ సుప్రీంకోర్టు వైద్యుల ప్రిస్క్రిప్షన్లు ఫార్మా కంపెనీల నుంచి లభించే ప్రయోజనాలతో ప్రభావితమయ్యే అవకాశాన్ని ఎత్తి చూపింది. ఇది తీవ్రమైన ప్రజా ప్రయోజన సమస్యగా పేర్కొంది. ఇలాంటి ప్రయోజనాల వ్యయం చివరికి ఔషధ ధరల్లోకి చేరి రోగులపై భారం పెంచే ప్రమాదం ఉందని కూడా కోర్టు రికార్డుల్లో ప్రస్తావించింది.

యూసీపీఎంపీకి చట్టబద్ధతపై చర్చ

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యూనిఫాం కోడ్ ఫర్ ఫార్మాస్యూటికల్స్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ (యూసీపీఎంపీ), 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఔషధ కంపెనీలు వైద్యులు, వారి కుటుంబ సభ్యులకు బహుమతులు, నగదు ప్రయోజనాలు, ఆతిథ్యం అందించడాన్ని నిషేధించింది. ఫార్మా కంపెనీలు తమ ఉద్యోగులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉల్లంఘనలపై ఫిర్యాదుల స్వీకరణ, విచారణ కూడా ఉంటుంది.

అయితే యూసీపీఎంపీ ప్రస్తుతం మార్గదర్శకాల ఆధారిత వ్యవస్థగానే ఉంది. దీనికి చట్టబద్ధత తేవాలనే చర్చ సాగుతోంది. కొత్త కమిటీ పరిశీలన ద్వారా నియంత్రణలో ఉన్న లోపాలు, అమలు సామర్థ్యం, బాధ్యత నిర్ధారణ వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: తులం బంగారం కొంటే ఎంత ఖర్చు? నేటి గోల్డ్‌ రేట్లు!

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)