Breaking News

వ్యాగన్ల నిర్వహణలో ఏఐకు పెద్దపీట

Published on Thu, 10/08/2026 - 11:31

దేశంలో సరకు రవాణాలో తన వాటాను పెంచేందుకు భారతీయ రైల్వే చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా వ్యాగన్ల నిర్వహణ, తనిఖీలను కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, సెన్సార్‌ ఆధారిత పర్యవేక్షణతో మరింత ఆధునికీకరిస్తోంది. ఈక్రమంలో రైల్వే వ్యాగన్లలో వేలాడుతున్న, వదులైన లేదా గల్లంతైన భాగాలను గుర్తించే మెషిన్‌ విజన్‌ ఇన్‌స్పెక్షన్‌ సిస్టమ్‌ (ఎంవీఐఎస్‌)కు ప్రాధాన్యం పెరుగుతోంది.

2026 మార్చి నాటికి నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వేలో మూడు, డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ (డీఎఫ్‌సీసీఐఎల్‌) పరిధిలో రెండు, సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో ఒక ఎంవీఐఎస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించాలని యోచిస్తున్నారు. డీఎఫ్‌సీసీఐఎల్‌తో కుదిరిన ఒప్పందం మేరకు రైల్వే నెట్‌వర్క్‌లో మరో నాలుగు ఎంవీఐఎస్‌లను ప్రవేశపెట్టే చర్యలు కొనసాగుతున్నాయి.

వైఫల్యాలకు ముందే హెచ్చరికలు

వ్యాగన్లలో లోపాలను ముందుగానే గుర్తించేందుకు ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ రోలింగ్‌ స్టాక్‌ (ఓఎంఆర్‌ఎస్‌), వీల్‌ ఇంపాక్ట్‌ లోడ్‌ డిటెక్టర్లు (డబ్ల్యూఐఎల్‌డీ)ను కూడా విస్తరిస్తున్నారు. తాజా అధికారిక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 25 ఓఎంఆర్‌ఎస్‌, 24 డబ్ల్యూఐఎల్‌డీ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇవి చక్రాలు, బేరింగులు తదితరాల పనితీరును పర్యవేక్షించి వైఫల్యాలకు ముందే హెచ్చరికలు అందించడంలో కీలకంగా మారాయి.

ఇదే సమయంలో సరకు రవాణాను మరింత అనుకూలంగా మార్చేందుకు వ్యాగన్‌ డిజైన్‌ విధానంలోనూ సంస్కరణలు చేపట్టారు. 2026 జులైలో ప్రకటించిన కొత్త విధానం ప్రకారం ఉక్కు, పెట్రోలియం, రసాయనాలు, పాలు, ప్లాస్టిక్‌తో సంబంధం ఉన్న సరుకు అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక వ్యాగన్‌ డిజైన్లను ప్రతిపాదించవచ్చు. వేగవంతమైన నిర్వహణ, అధిక భద్రత, మెరుగైన సరకు రవాణా సామర్థ్యం దిశగా రైల్వే చర్యలు చేపడుతోంది.

ఇదీ చదవండి: తులం బంగారం కొంటే ఎంత ఖర్చు? నేటి గోల్డ్‌ రేట్లు!

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)