Breaking News

యాపిల్‌లో కాఫీ యంత్రాలు మేనేజ్‌ చేస్తే రోజుకు రూ.28 వేలు!

Published on Mon, 10/05/2026 - 13:27

ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పుడు ఓ విచిత్రమైన ఉద్యోగ ప్రకటనతో వార్తల్లోకి వచ్చింది. ఐఫోన్లు, మ్యాక్‌లతో ఏ మాత్రం సంబంధం లేని ఈ పోస్టు యంత్రాల నిర్వహణకు సంబంధించింది. అమెరికాలోని కాలిఫోర్నియా శాంటా క్లారాలో ‘ఐకప్ సప్లై స్పెషలిస్ట్’ పోస్టు కోసం యాపిల్ ప్రకటన ఇచ్చింది. ఉద్యోగులందరికీ విరామ గదుల్లో తాజా కాఫీ అందుబాటులో ఉండేలా చూడటమే ఈ ఉద్యోగి బాధ్యత.

వేతనం ఎంత?

ఈ పోస్టుకు గంటకు 27.75 నుంచి 36.05 డాలర్ల వరకు (భారత కరెన్సీలో సుమారు రూ.2,670–3,500) బేసిక్ పే నిర్ణయించారు. గరిష్ఠ వేతనాన్ని రోజుకు ఎనిమిది గంటల పని చొప్పున లెక్కిస్తే సుమారు రూ.28 వేలు అవుతుంది.

బాధ్యతలేమిటి?

ఎంపికైన వ్యక్తి వేర్వేరు ప్రాంతాలకు వాహనంలో వెళ్లి గరిష్ఠంగా 90 బీన్-టు-కప్ కాఫీ యంత్రాలను శుభ్రం చేసి స్టోరేజీని మేనేజ్‌ చేయాలి. కాఫీ గింజలు, ఇతర సామగ్రిని నింపడం, వాటిని శుభ్రపరచడం రోజువారీ పనుల్లో భాగం. ‘యాపిల్‌లో మేం కాఫీ ఎక్కువగా తాగుతాం. ఈ ఉద్యోగంలోకి రావాలనుకునే అభ్యర్థులకు అసాధారణ సేవాభావం ఉండాలి’ అని యాపిల్‌ కోరింది. అయితే ‘ఐకప్’ అనే పేరును యాపిల్ 2014 నుంచే వాడుతోంది.

కంపెనీ ఆఫర్‌ చేస్తున్న వేతనాన్ని భారత కరెన్సీలోకి మార్చి చూస్తే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ అమెరికాలో జీవన వ్యయం, పన్నులు, గంటల ఆధారిత వేతన విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇది ఇంజినీరింగ్ ఉద్యోగం కాదు, క్షేత్రస్థాయి సర్వీసు జాబ్‌. అయినా ఉద్యోగుల సౌకర్యాన్ని ఇంత సీరియస్‌గా చూసే యాపిల్ సంస్కృతి ఈ ప్రకటనలో కనిపిస్తోంది.

ఇదీ చదవండి: పసిడి ధరలపై ఓ లుక్కేయండి!

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)