ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
ప్రపంచంలోనే ఎత్తైన బంగారు కడ్డీ.. గిన్నిస్ రికార్డు
Published on Sat, 10/03/2026 - 02:05
బంగారం అంటే సాధారణంగా చిన్న కడ్డీలు, ఆభరణాలే గుర్తుకొస్తాయి. కానీ యూఏఈలోని షార్జాలో ఏకంగా 2.12 మీటర్ల ఎత్తైన బంగారు కడ్డీ సందర్శకులను ఆకట్టుకుంటోంది. షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతున్న 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో దీనిని ప్రదర్శిస్తున్నారు. బులియన్ ట్రేడింగ్ కంపెనీ (బీటీసీ) ప్రదర్శిస్తున్న ఈ కడ్డీకి ప్రపంచంలోనే ఎత్తైన బంగారు కడ్డీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది.
ఈ బంగారు కడ్డీ ఎత్తు 2.12 మీటర్లు (6 అడుగుల 11.5 అంగుళాలు). బరువు సుమారు 30 కిలోలు కాగా, ప్రస్తుత బంగారం ధరల ప్రకారం దీని విలువ 15 మిలియన్ దిర్హామ్‌లకు (సుమారు రూ.39 కోట్లు) పైగా ఉంటుందని ‘ఎమారత్ అల్ యౌమ్’ పేర్కొంది. అయితే ఈ కడ్డీని విక్రయించేందుకు కాకుండా గిన్నిస్ రికార్డు ప్రదర్శనలో భాగంగా ఉంచినట్లు తెలిపింది.
ఎత్తు చూసుకోవచ్చు
బంగారు కడ్డీని సాధారణ రూపంలో కాకుండా భారీ గోల్డెన్ రూలర్ తరహాలో నిలువుగా ఏర్పాటు చేశారు. సందర్శకులు కడ్డీ పక్కన నిలబడి తమ ఎత్తును చూసుకోవచ్చు. దీంతో బంగారు కడ్డీ పక్కన నిలబడి ఫొటోలు తీసుకునేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. కడ్డీ పక్కనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు.
Tags : 1