ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
రెబెల్ 500 బైక్స్ వెనక్కి.. కారణం ఇదే!
Published on Fri, 10/02/2026 - 20:48
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) దేశంలో 96 రెబెల్ 500 బైక్‌లకు రీకాల్ ప్రకటించింది. ఏప్రిల్ 2025 నుంచి ఆగస్టు 2025 మధ్య తయారైన ఈ బైక్‌లలో హ్యాండిల్-లాక్ ఫిక్సింగ్ స్క్రూకు సంబంధించిన సమస్య ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
అసెంబ్లీ సమయంలో స్క్రూను సరైన టార్క్‌తో బిగించకపోవడంతో, కాలక్రమేణా అది వదులయ్యే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దీనివల్ల స్టీరింగ్ కదలికపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే 2026 సెప్టెంబర్ 30 వరకు భారత్‌లో ఈ సమస్య కారణంగా ఎలాంటి ఘటనలు నమోదు కాలేదని సంస్థ స్పష్టం చేసింది.
ముందుజాగ్రత్త చర్యగా.. ప్రభావితమైన అన్ని బైక్‌లలో హ్యాండిల్-లాక్ ఫిక్సింగ్ స్క్రూను ఉచితంగా మార్చి ఇవ్వనున్నారు. బైక్ వారంటీలో ఉందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా ఈ సర్వీస్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. రీకాల్ కార్యక్రమం 2026 నవంబర్ మొదటి వారంలో హోండా అధీకృత బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా ప్రారంభం కానుంది. ప్రభావిత కస్టమర్లను ఫోన్ కాల్స్, SMSలు, ఇమెయిల్స్ ద్వారా కంపెనీ నేరుగా సంప్రదించనుంది.
మీ రెబెల్ 500 బైక్ ఈ రీకాల్‌లో ఉందో లేదో తెలుసుకోవాలంటే, హోండా అధికారిక వెబ్‌సైట్‌లోని రీకాల్ క్యాంపెయిన్ విభాగంలో వీఐఎన్ నంబర్ నమోదు చేసి చెక్ చేసుకోవచ్చు. బైక్ రీకాల్ పరిధిలో ఉంటే, సమీపంలోని హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ను సంప్రదించి సర్వీస్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. స్క్రూ మార్పిడి ప్రక్రియను కంపెనీ ఉచితంగా నిర్వహించనుంది.
ఇదీ చదవండి: పెరిగిన హారియర్ ఈవీ ధర!
Tags : 1