ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
తప్పనిసరి రీచార్జ్ ప్లాన్లను ప్రత్యేకంగా డిస్ప్లే చేయాలి
Published on Fri, 10/02/2026 - 02:50
న్యూఢిల్లీ: నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అందించాల్సిన రీచార్జ్ ప్లాన్లు, స్పెషల్ టారిఫ్ వోచర్లను తమ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లలో ప్రత్యేకంగా కనిపించేలా కచ్చితంగా డిస్ప్లే చేయాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సూచించింది. ప్రస్తుతం టెల్కోలు వీటిని డిస్ప్లే చేస్తున్నప్పటికీ, పారదర్శకత పాటించడం లేదని, అంత సులువుగా కనిపించకుండా చేస్తున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ట్రాయ్ తాజా ఆదేశాలు ఇచ్చింది.
స్పష్టంగా కనిపించేలా ’ట్రాయ్ తప్పనిసరి చేసిన ప్యాక్‌లు’ అంటూ ప్రత్యేక ట్యాబ్ లేదా సెక్షన్‌ని రూపొందించి, అందులో వివిధ వోచర్లను పొందుపర్చాలని పేర్కొంది. వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లలో ప్రీపెయిడ్ రీచార్జ్ సెక్షన్లో ఇది మొదటి సెక్షన్‌గా ఉండాలని తెలిపింది. అలాగే, ఇతరత్రా విక్రయ కేంద్రాల్లో సైతం వీటిని ప్రత్యేకంగా డిస్ప్లే చేయాలని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల వారు, ఎక్కువగా చెల్లించే సామర్థ్యాలు లేని వారిని దృష్టిలో ఉంచుకుని డేటా కలపకుండా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం తక్కువ ధరతో, 30 రోజుల వరకు వేలిడిటీతో ప్రత్యేక టారిఫ్ వోచర్లను ప్రవేశపెట్టాలంటూ టెల్కోలను ట్రాయ్ ఇటీవలే ఆదేశించింది.
Tags : 1