Breaking News

UAE: భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Published on Thu, 10/01/2026 - 01:56

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లో వాహనదారులకు ఇంధన ధరల రూపంలో మరోసారి షాక్‌ తగిలింది. అక్టోబర్‌ నెలకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా పెంచుతూ యూఏఈ ఇంధన ధరల కమిటీ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలు అక్టోబర్‌ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే అన్ని రకాల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి.

అక్టోబర్‌లో సూపర్‌ 98 పెట్రోల్‌ ధర లీటరుకు 4.40 దిర్హమ్‌లకు చేరింది. సెప్టెంబర్‌లో ఇది 3.80 దిర్హమ్‌లుగా ఉండగా.. లీటరుకు 0.60 దిర్హమ్‌ పెరిగింది. అంటే సుమారు 15.8 శాతం పెరుగుదల. ఇక స్పెషల్‌ 95 పెట్రోల్‌ ధర 3.69 దిర్హమ్‌ల నుంచి 4.28 దిర్హమ్‌లకు చేరింది. దీంతో లీటరుకు 0.59 దిర్హమ్‌ పెరగ్గా.. పెరుగుదల సుమారు 16 శాతంగా నమోదైంది.

అదేవిధంగా ఈ-ప్లస్‌ 91 పెట్రోల్‌ ధర 3.61 దిర్హమ్‌ల నుంచి 4.21 దిర్హమ్‌లకు పెరిగింది. లీటరుకు 0.60 దిర్హమ్‌ పెరగడంతో ఇది 16.6 శాతం పెరిగింది. డీజిల్‌ ధర కూడా 4.30 దిర్హమ్‌ల నుంచి 4.80 దిర్హమ్‌లకు చేరింది. అంటే లీటరుకు 0.50 దిర్హమ్‌ పెరుగుదలతో 11.6 శాతం అధికమైంది.

ప్రపంచ చమురు ధరల ప్రభావం

యూఏఈలో ఇంధన ధరలను ప్రతి నెలా సమీక్షించి సవరించే విధానం అమల్లో ఉంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో ధరల కదలికలను పరిగణనలోకి తీసుకుని వచ్చే నెలకు సంబంధించిన రిటైల్‌ ధరలను నెలాఖరులో ఇంధన ధరల కమిటీ ప్రకటిస్తుంది. అక్టోబర్‌ ధరలు కూడా ఈ నెలవారీ ధరల విధానం కిందనే నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.

కాగా సెప్టెంబర్‌లో కూడా యూఏఈలో ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా అక్టోబర్‌లో మరింత భారీగా పెరగడంతో వరుసగా రెండో నెలలోనూ వాహనదారులపై ఇంధన భారం పెరిగింది. ఈ-ప్లస్‌ 91 పెట్రోల్‌లో 16.6 శాతం పెరుగుదల నమోదవడం అక్టోబర్‌ నెలలో అన్ని ఇంధన రకాలలో అత్యధికం.

Videos

వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి

ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్

9/11 తరహాలో కుట్ర జరిగిందా..? ఫ్లై దుబాయ్ ఎమర్జెన్సీ లాండింగ్ లో సంచలన విషయాలు

ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా

ఫిలిం ఛాంబర్ లో సుమలత రచ్చ రచ్చ

వైఎస్ జగన్ ను కలిసిన లంకపల్లి రైతులు

జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? చెప్పు తీసుకుని తరిమి తరిమి కొడతాం...

కోహ్లి నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

రజనిపై పోలీసుల తీరు.. ఇచ్చిపడేసిన విశాఖ అడ్వకేట్స్

Photos

+5

భారత్‌ వర్సెస్‌ విండీస్‌ మ్యాచ్ హైలైట్స్ ఫోటోలు!

+5

హైదరాబాద్ ధూల్ పేట్ లో దుర్గమ్మ విగ్రహాలు (ఫొటోలు)

+5

డ్యాన్స్ అకాడమీలో మెరిసిన హీరోయిన్స్ నివేదా, ఈషా రెబ్బా.. ఫోటోలు

+5

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు (ఫొటోలు)

+5

నల్లటి చీరలో 'తత్వం' సినిమా హీరోయిన్ దశ్విక... ఈమె గురించి తెలుసా?

+5

చెమట చిందిస్తూ.. కండలు చూపిస్తూ తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

'డిసి' ఫేమ్ వామికా గబ్బి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లేత గులాబీ రంగు చీరలో నిహారిక మెరుపులు (ఫొటోలు)

+5

వైరల్ మూవీ.. కీర్తి సురేశ్ 'డోరోతి' జ్ఞాపకాలు (ఫొటోలు)