Breaking News

పాడితే పరవశమే.. సుధా స్వరానికి ఫిదా కావాల్సిందే!

Published on Wed, 09/30/2026 - 14:22

సుధ అంటే అమృతం. ఆమె పేరులోని అమృతం ఆమె గొంతులో ప్రవహిస్తే... ఆ స్వర సమ్మోహనంలో తేలియాడిన శ్రోతలకు స్వర్గంలో విహరించినట్టు ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. భగవంతుడిచ్చిన వరమో, గురువుల ఆశీర్వాదమో, తల్లిదండ్రుల ఆశీస్సుల ఫలితమో ఆమె పాడుతుంటే మనసు మరోలోకంలో విహరిస్తుంది. అది శాస్త్రీయ సంగీతమైనా,  మరే భారతీయ సంప్రదాయ సంగీతమైనా ఆ గానమాధుర్యానికి మైమరచిపోవలసిందే. ఆనంద డోలికలలో ఓలలాడాల్సిందే.  

విజయవాడ నగరానికి చెందిన చిముడూరి సుధా శ్రీనివాస్‌ ఈ తరంలో ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులలో ఒకరిగా భాసిస్తున్నారు. సుధాశ్రీనివాస్‌  తల్లిదండ్రులు కొల్లంకోడు గిరిజ, రామచంద్రన్‌. సుధ ఏడేళ్ల వయసులో సంగీతం అభ్యసించడం ప్రారంభించారు.

సద్గురువుల శిక్షణలో... 
విఖ్యాత సంగీత విద్వాంసులు అన్నవరపు రామస్వామి, అంపోలు మురళీకృష్ణ, పెమ్మరాజు సూర్యారావుల వద్ద శాస్త్రీయ సంగీతంతో పాటు, లలిత సంగీతం, జానపద సంగీతం, భారతీయ సంగీతంలో వివిధ ప్రక్రియలలో పరిణితి 
సాధించారు.

ప్రముఖ నాట్యాచార్యులతో... 
కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యంతో పాటు  రాధారెడ్డి, రాజారెడ్డి, స్వప్న సుందరి, శోభానాయుడు, జయరామారావు, మంజూభార్గవి లాంటి దిగ్గజాలతో సుధా శ్రీనివాస్‌ వేదిక పంచుకున్నారు. వారి నాట్య భంగిమలకు ఆమె గాత్రంతో ఆ ప్రదర్శనలను రంజింపజేశారు.

లైవ్‌ కార్యక్రమంలో సుధాశ్రీనివాస్‌(ఫైల్‌)

అంతర్జాతీయ సంగీత ప్రస్థానం...
ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ (ఐసీసీఆర్‌), ఇతర సాంస్కృతిక సంస్థల ఆహ్వానం మేరకు సుధాశ్రీనివాస్‌ అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇటలీ, దుబాయి, అమెరికా, యూనివర్సిటీ ఆఫ్‌ ఫిలడెలి్ఫయా, టొరెంటో, కెనడా తదితర దేశాలలో నృత్య కార్యక్రమాలకు  తన గాత్ర మాధుర్యాన్ని పంచారు.

దేశ విదేశాలలో... 
ఇప్పటివరకు దేశ విదేశాలలో 2800  పైగా ప్రదర్శనలు,  42  నృత్య రూపకాలకు,  500కు పైగా లలిత జానపద గీతాలకు, సోలో గీతాలకు ఆమె గాత్రాన్ని అందించారు.

పురస్కారాలు, సత్కారాలు..
సుధా శ్రీనివాస్‌ ఉగాది పురస్కారం, రాగమాధురి, గాన లహరి, రోటరీ యువ పురస్కారం, యంగ్‌ అచీవర్స్, యువ పురస్కారం పొందారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు నిర్వహించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. సినీ నేపథ్యగాయనిచిత్రనుంచి అభినందనలు అందుకున్నారు.

గురుముఖంగా సాధన చేయాలి..
''సంగీతమైనా, నృత్యమైనా గురుముఖంగా సాధన చేయాలి. సంగీతం ఓ తపస్సులా భావించాలి. సంగీత సరస్వతికి అర్చనలా భావించాలి. అంకిత భావం, చిత్తశుద్ధి ఏకాగ్రత అవసరం. నిరంతరం సాధన చేయాలి.''

– సుధాశ్రీనివాస్‌

ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం వదలి ఆటో డ్రైవర్‌గా మహిళా టెకీ..!

Videos

వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి

ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్

9/11 తరహాలో కుట్ర జరిగిందా..? ఫ్లై దుబాయ్ ఎమర్జెన్సీ లాండింగ్ లో సంచలన విషయాలు

ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా

ఫిలిం ఛాంబర్ లో సుమలత రచ్చ రచ్చ

వైఎస్ జగన్ ను కలిసిన లంకపల్లి రైతులు

జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? చెప్పు తీసుకుని తరిమి తరిమి కొడతాం...

కోహ్లి నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

రజనిపై పోలీసుల తీరు.. ఇచ్చిపడేసిన విశాఖ అడ్వకేట్స్

Photos

+5

భారత్‌ వర్సెస్‌ విండీస్‌ మ్యాచ్ హైలైట్స్ ఫోటోలు!

+5

హైదరాబాద్ ధూల్ పేట్ లో దుర్గమ్మ విగ్రహాలు (ఫొటోలు)

+5

డ్యాన్స్ అకాడమీలో మెరిసిన హీరోయిన్స్ నివేదా, ఈషా రెబ్బా.. ఫోటోలు

+5

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు (ఫొటోలు)

+5

నల్లటి చీరలో 'తత్వం' సినిమా హీరోయిన్ దశ్విక... ఈమె గురించి తెలుసా?

+5

చెమట చిందిస్తూ.. కండలు చూపిస్తూ తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

'డిసి' ఫేమ్ వామికా గబ్బి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లేత గులాబీ రంగు చీరలో నిహారిక మెరుపులు (ఫొటోలు)

+5

వైరల్ మూవీ.. కీర్తి సురేశ్ 'డోరోతి' జ్ఞాపకాలు (ఫొటోలు)