Breaking News

బడిలో ఎవరైనా ఏడిపిస్తున్నారా..? ఈ పాప చెప్పే టిప్స్‌ ఫాలో అయిపోండి..

Published on Wed, 09/30/2026 - 13:32

స్కూల్లో తోటి పిల్లలు ఎవరైన ఏడిపిస్తుంటే ఎలా బదులు ఇవ్వాలి, వాటిని ఎలా అధిగమంచాలో చెప్పేస్తుంది ఈ 11 ఏళ్ల చిన్నారి. ఆమె చిన్న వయసులోనే అరుదైన వ్యాధి బారిన పడి..దాని కారణంగా శారీరకంగా అధిక బరువుతో ఇబ్బండింది. దీంతో తనకు స్కూల్లో ఎలాంటి వేధింపులు ఎదరయ్యే తాను వాటిని ఎలా ఎదుర్కొందో పంచుకుందామె. అంతేగాదు ఆ వేధింపులన్నింటిని అధిగమంచి ఓరి వంటి ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో పనిచేస్తూ..అందరు మెచ్చే కంటెంట్‌ క్రియేటర్‌ రాణించడం విశేషం. 

ఆ చిన్నారే 11 ఏళ్ల గునిత్‌ బంగా. ఆరేళ్ల వయసుకే అధిక ప్రోటీన్‌ లీక్‌ అయ్యే పరిస్థితి అయిన నెఫ్‌రోటిక్‌ సిండ్రోమ్‌తో పోరాడుతోంది. ఈ వ్యాధి నిర్థారణ అయినప్పుడు ఆమెకు కేవలం ఆరేళ్లు మాత్రమే. ఇది మూత్రపిండాలు దెబ్బతినడంతో వచ్చే సమస్య అట. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా ఇచ్చిన స్టెరాయిడ్లు వల్ల ముఖం వాపుకి గురై, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఈ శారీరక మార్పులు కారణంగా స్కూల్లో అవహేళనలు ఎదుర్కొనేది. తోటి పిల్లలు తనను ఎంతగానే వేధించేవారని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీడియోలో వివరించింది. 

ఒక్కోసారి వాళ్లు అనే మాటలకు తనకు తిరిగి కొట్టాలని కూడా అనిపించేది, కానీ దాని వల్ల తాను కూడా బ్యాడ్‌ అవుతాననే ఉద్దేశ్యంతో ఆ పని చేయలేదని చెప్పుకొచ్చింది. తనలా వేధింపులకు గురైన ఈ చిన్నారులు ఈ మూడు సూత్రాలు ఫాలో అవ్వండి అప్పుడు మీ జోలికి ఎవ్వరు రారని అంటోంది. అంతేగాదు ఈ వేధింపులు మీ ఎదుగుదలకు ఆటంకం కాకుండా చూసుకోవాలని సూచిస్తోంది కూడా. ఇంతకీ ఆ చిన్నారి చెప్పిన టిప్స్‌ ఏంటంటే..

డోంటే కేర్‌ అన్నట్లు ఉండండి..
ఎవరేమన్న ఐ డోంట్‌కేర్‌ అన్నట్లు ఉండండి. మీ తోటి స్నేహితులు ఏమన్న పట్టించుకోవద్దు. అదే వాళ్లకు గట్టి సమాధానం అంటుంది. ఒక వేళ ఇలా ఉండటం మా వల్ల కాదంటరా..?

నేరుగా నిలదీసేయండి..
మిమ్మల్ని బాగా ఇబ్బందిపడుతున్న వాళ్ల వద్దకు వెళ్లి..అసలు మీ సమస్య ఏంటి అని గట్టిగా ఆడగండి. ఒక వేళ మీరేమైనా నాకు ఫుడ్‌ పెడతున్నారా..లేక మీరు నా బాగోగులు చేసుకుంటున్నారా ఎందుకిదంతా అని దులిపేయండి. అప్పటికీ పరిస్థితి అదుపులోకిరాకపోతే..

పెద్దలు లేదా ప్రిన్స్‌పాల్‌కి ఫిర్యాదు..
ఇంకా ఆ వేధింపులకు బ్రేక్‌ పడకుండా దాడి చేసే వరకు దారితీస్తే..మిమ్మల్ని ఎంతో ఇష్టపడే మీ పెద్దలకు లేదా ప్రిన్స్‌పాల్‌కు నేరుగా ఫిర్యాదు చేయండి. అప్పుడే సమస్య పరిష్కారమవుతుంది. ఎందుకంటే ఎవర్నీ కొట్టే హక్కు లేదు..అలాగే వాళ్ల తీరుని మార్చలేం..అందువల్ల మన పెద్దలకు లేదా ప్రిన్స్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తే..తప్పక మన పరిస్థితిలో మార్పు వస్తుందని చెబుతోంది. 

సైకాలజిస్ట్‌లు సైతం..
చిన్నారులు వేధింపులకు గురైతే భావోద్వేగంగా చాలా ప్రభావానికి గురవ్వుతారని అంటున్నారు. పైకి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా..వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని అంటున్నారు. ముఖ్యంగా అభద్రత భావానికి లోనై పదిమందిలోకి రావడానికి ఇష్టపడరు. పైగా ఒంటరిగా ఉండేదుకే ఇష్టపడతారని హెచ్చరిస్తున్నారు. ఒకరకంగా దీనివల్ల ఆయా పిల్లల చదువు మీద కూడా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. 

అందుకే ఇలాంటి వేధింపులకు గురయ్యే చిన్నారులను ధైర్యంగా తమను కామెంట్‌ చేయడం ఆపమని చెప్పేలా ప్రోత్సహించాలే తప్ప..దాడి చేయకూడదని చెప్పాలి. పరిస్థితి దిగజారితే ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించమని చెబుతున్నారు నిపుణుల కూడా. అలాగే స్నేహితులు లేరని బాధపడకుండా ఉండేలా చేయాలి..తమతో ఫ్రెండ్‌షిప్‌ చేసే ఒక్క స్నేహితుడు చాలు అని భరోసా ఇవ్వాలి. తన సామర్థ్యంతో ఎలా అందరు తనతో మాట్లాడేలా చేసుకోవాలో ఆ చిన్నారులకు అవగాహన కల్పించాలి, భరోసా ఇవ్వాలని చెబుతున్నారు నిపుణులు.

 

ఇదీ చదవండి: క్యాష్ రిసిప్ట్ తీసుకునే ముందు జాగ్రత్త.. థర్మల్ పేపర్‌తో క్యాన్సర్ వస్తుందా..?

 

#

Tags : 1

Videos

వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి

ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్

9/11 తరహాలో కుట్ర జరిగిందా..? ఫ్లై దుబాయ్ ఎమర్జెన్సీ లాండింగ్ లో సంచలన విషయాలు

ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా

ఫిలిం ఛాంబర్ లో సుమలత రచ్చ రచ్చ

వైఎస్ జగన్ ను కలిసిన లంకపల్లి రైతులు

జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? చెప్పు తీసుకుని తరిమి తరిమి కొడతాం...

కోహ్లి నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

రజనిపై పోలీసుల తీరు.. ఇచ్చిపడేసిన విశాఖ అడ్వకేట్స్

Photos

+5

భారత్‌ వర్సెస్‌ విండీస్‌ మ్యాచ్ హైలైట్స్ ఫోటోలు!

+5

హైదరాబాద్ ధూల్ పేట్ లో దుర్గమ్మ విగ్రహాలు (ఫొటోలు)

+5

డ్యాన్స్ అకాడమీలో మెరిసిన హీరోయిన్స్ నివేదా, ఈషా రెబ్బా.. ఫోటోలు

+5

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు (ఫొటోలు)

+5

నల్లటి చీరలో 'తత్వం' సినిమా హీరోయిన్ దశ్విక... ఈమె గురించి తెలుసా?

+5

చెమట చిందిస్తూ.. కండలు చూపిస్తూ తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

'డిసి' ఫేమ్ వామికా గబ్బి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లేత గులాబీ రంగు చీరలో నిహారిక మెరుపులు (ఫొటోలు)

+5

వైరల్ మూవీ.. కీర్తి సురేశ్ 'డోరోతి' జ్ఞాపకాలు (ఫొటోలు)