వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి
Breaking News
కేంద్రం కొత్త కేఫ్-3 నిబంధనలు
Published on Wed, 09/30/2026 - 12:41
దేశంలో వాహన ఉద్గారాలను తగ్గించి ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడో విడత కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేఫ్-3) నిబంధనలకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2027 ఏప్రిల్ 1 నుంచి 2032 మార్చి 31 వరకు ఐదేళ్ల కాలపరిమితితో అమల్లోకి రానున్న ఈ నిబంధనలు ఆటోమొబైల్ తయారీ సంస్థలకు నూతన సవాళ్లతో పాటు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి.
కఠినతరమైన ఇంధన వినియోగ లక్ష్యాలు
నూతన కేఫ్-3 నిబంధనల్లో కార్బన్ ఉద్గారాల పరిమితులను కేంద్రం గణనీయంగా కుదించింది. 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలై ఏటా ఈ లక్ష్యాలు మరింత కఠినతరం కానున్నాయి. కార్పొరేట్ ఫ్లీట్ సగటు ఇంధన వినియోగాన్ని లెక్కిస్తూ కేవలం ఒక్కో మోడల్ కాకుండా కంపెనీ తయారుచేసే లేదా దిగుమతి చేసుకునే మొత్తం వాహనాల సగటు ఉద్గారాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. గడువు ముగిసే నాటికి పర్యావరణహిత ప్రమాణాలు మరింత గరిష్ఠ స్థాయికి చేరనున్నాయి.
ఈవీలకు భరోసా
ఈ నిబంధనల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను క్రెడిట్ లెక్కింపు కోసం ఒక వాహనాన్ని మూడింతలుగా (3x సూపర్ క్రెడిట్) పరిగణిస్తారు. అలాగే ప్లగ్-ఇన్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలకు 2.5x వరకు, ఇతర స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లకు 1.6x వరకు వెయిటేజీ వర్తిస్తుంది. దీనివల్ల ఈవీలు, హైబ్రిడ్ మోడళ్లను ఎక్కువగా విక్రయించే కంపెనీలు సులభంగా క్రెడిట్‌లు పొంది తమ ఫ్లీట్ సగటు ఉద్గార లక్ష్యాలను చేరుకునే వెసులుబాటు లభిస్తుంది.
బయోఫ్యూయల్‌కు వెసులుబాటు
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈ20+), బయో-సీఎన్‌జీ వంటి జీవ ఇంధనాలను ఉపయోగించే వాహనాలకు కార్బన్ న్యూట్రాలిటీ ఫ్యాక్టర్ల ద్వారా ఉద్గార తగ్గింపు ప్రయోజనాన్ని అందించనున్నారు. టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ వంటి ఇంధన పొదుపు సాంకేతికతలకు కూడా అదనపు వెసులుబాటు కల్పించారు. ఏడాదికి 1,000 కన్నా తక్కువ వాహనాలు ఉత్పత్తి చేసే చిన్న తయారీదారులకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం!
Tags : 1