Breaking News

‘బ్యాంకులు పంట రుణాలు వసూలు చేయవద్దు’

Published on Wed, 09/30/2026 - 11:09

తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరవుతో అతలాకుతలమవుతున్న మహారాష్ట్రలో రైతులకు ఉపశమనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల దృష్ట్యా పంట రుణాల వసూళ్ల కోసం రైతుల ఇళ్లకు వెళ్లవద్దని బ్యాంకులు, పరపతి సంఘాలను రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాన్కులే సారథ్యంలోని ‘కరవు సహాయక క్యాబినెట్ సబ్‌కమిటీ’ ఆదేశించింది. రుణ వసూళ్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసేలా అధికారిక సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా ఆర్‌బీఐని కోరేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్‌ను కమిటీ ఆదేశించింది.

రాష్ట్రంలోని మొత్తం 358 తాలూకాలలో 74 శాతానికి పైగా, అంటే 265 తాలూకాల్లో తీవ్ర కరవు పరిస్థితులు దాపురించాయని ప్రభుత్వం వెల్లడించింది. 2016 (2020లో సవరించిన) కరవు నిర్వహణ నియమావళిలోని ‘ట్రిగ్గర్-1’ (25 శాతం కంటే ఎక్కువ వర్షపాత లోటు, వరుసగా 21 రోజుల పొడి వాతావరణం) ఆధారంగా ఈ తాలూకాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. మరో 43 తాలూకాలు ‘ట్రిగ్గర్-2’ (పంటల విస్తీర్ణం-నష్టం, భూగర్భ జలాలు, జలాశయాల నీటిమట్టం ఆధారంగా) పరిధిలోకి వస్తున్నాయని, వీటికి జాప్యం లేకుండా వెంటనే జీవో జారీ చేయాలని ఐఏఎస్ అధికారిణి వినీతా వేద్ సింఘాల్ పేర్కొన్నారు.

తీవ్ర నీటి ఎద్దడి.. భవిష్యత్తు కార్యాచరణ

పట్టణ ప్రాంతాల్లో 10% నీటి సరఫరా కోత విధించాలని, ప్రస్తుతం సేకరించిన నీటిని వచ్చే ఏడాది జూన్ వరకు లభ్యమయ్యేలా బఫర్ స్టాక్‌గా నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 560 ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తుండగా రాబోయే 10 నెలల పాటు మంచినీరు, పశువుల మేత కొరత రాకుండా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తీవ్ర నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో గృహ, వాణిజ్య నిర్మాణ అనుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని పర్యావరణ మంత్రి పంకజా ముండే సూచించారు. సరస్సుల చుట్టూ జరిగే నీటి దొంగతనాలను అరికట్టేందుకు విద్యుత్తు కనెక్షన్లు తొలగించాలని మంత్రి గిరీష్ మహాజన్ ఆదేశించారు.

ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం!

Videos

వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి

ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్

9/11 తరహాలో కుట్ర జరిగిందా..? ఫ్లై దుబాయ్ ఎమర్జెన్సీ లాండింగ్ లో సంచలన విషయాలు

ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా

ఫిలిం ఛాంబర్ లో సుమలత రచ్చ రచ్చ

వైఎస్ జగన్ ను కలిసిన లంకపల్లి రైతులు

జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? చెప్పు తీసుకుని తరిమి తరిమి కొడతాం...

కోహ్లి నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

రజనిపై పోలీసుల తీరు.. ఇచ్చిపడేసిన విశాఖ అడ్వకేట్స్

Photos

+5

భారత్‌ వర్సెస్‌ విండీస్‌ మ్యాచ్ హైలైట్స్ ఫోటోలు!

+5

హైదరాబాద్ ధూల్ పేట్ లో దుర్గమ్మ విగ్రహాలు (ఫొటోలు)

+5

డ్యాన్స్ అకాడమీలో మెరిసిన హీరోయిన్స్ నివేదా, ఈషా రెబ్బా.. ఫోటోలు

+5

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు (ఫొటోలు)

+5

నల్లటి చీరలో 'తత్వం' సినిమా హీరోయిన్ దశ్విక... ఈమె గురించి తెలుసా?

+5

చెమట చిందిస్తూ.. కండలు చూపిస్తూ తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

'డిసి' ఫేమ్ వామికా గబ్బి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లేత గులాబీ రంగు చీరలో నిహారిక మెరుపులు (ఫొటోలు)

+5

వైరల్ మూవీ.. కీర్తి సురేశ్ 'డోరోతి' జ్ఞాపకాలు (ఫొటోలు)