Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. 1.58 కోట్ల కార్డులు రద్దు?
Published on Tue, 09/29/2026 - 15:18
కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో ఉన్న రేషన్ కార్డుల డేటాను శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా కీలక చర్యలు చేపట్టనుంది. గత ఆరు నెలలుగా తమ రేషన్ కార్డుపై ఎలాంటి ఆహార ధాన్యాలను తీసుకోని.. సుమారు 1.58 కోట్ల మంది లబ్ధిదారుల రేషన్ కార్డులను అక్టోబర్ నుంచి తాత్కాలికంగా నిలిపివేయనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.
మూడు నెలలు గడువు
లబ్ధిదారుల పేర్లను డేటాబేస్ నుండి వెంటనే తొలగించరు. వారు నిజమైన లబ్ధిదారులని నిరూపించుకోవడానికి మూడు నెలల సమయం ఇస్తూ, మొదట వారి రేషన్ కార్డులను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఈ వ్యవధిలోగా వారు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తే, వారి కార్డులను తిరిగి యాక్టివేట్ చేయనున్నట్లు సమాచారం.
వినియోగదారు ఆరు నెలలుగా రేషన్ తీసుకోకపోవడానికి కారణాలు చాలానే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డును వెంటనే నిలిపివేయదు. అందుకే ముందుగా ధృవీకరణకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
ప్రభుత్వ చర్యకు కారణం
నకిలీ, డూప్లికేట్, మరణించిన వ్యక్తుల పేర్లతో ఉన్న లేదా ప్రస్తుతం అర్హత లేని రేషన్ కార్డులను గుర్తించడానికి ప్రభుత్వం ఈ చర్యకు సిద్ధమైంది. దీని వల్ల ప్రభుత్వ రేషన్ నిజమైన లబ్ధిదారులకు చేరుతుందని, రేషన్ ధాన్యాల వృధా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆధార్ అనుసంధానం, డిజిటలైజేషన్, ఈ-కేవైసీ వంటి విధానాలను ఉపయోగించి పీడీఎస్ డేటాబేస్ను శుభ్రం చేస్తున్నారు.
అయితే.. ఈ విధానంపై కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి చెందిన రాజేంద్రన్ నారాయణన్ ప్రకారం.. రేషన్ తీసుకోని కారణాన్ని ముందుగా తెలుసుకోకుండా, కార్డును నిలిపివేయడం వల్ల నిజమైన లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు, వలసలు లేదా రేషన్ డీలర్తో సమస్యల కారణంగా కొంతమంది రేషన్ తీసుకోకపోయి ఉండవచ్చని ఆయన అన్నారు.
మొత్తం మీద.. ప్రభుత్వం రేషన్ వ్యవస్థలో అనర్హమైన, ఉపయోగంలో లేని కార్డులను తొలగించి వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయాలని చూస్తోంది. అదే సమయంలో.. నిజంగా అర్హులైన పేదలు పొరపాటున రేషన్ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే ఈ ప్రక్రియలో ఈ-కేవైసీతో పాటు లబ్ధిదారుల వాస్తవ పరిస్థితిని కూడా పరిశీలించడం అవసరం.
ఇదీ చదవండి: ఆ ఒక్క రోజు UPI చెల్లింపులు బంద్!
Tags : 1