Breaking News

అలర్ట్‌.. అక్టోబరు 1 నుంచి నిబంధనలు మార్పు

Published on Tue, 09/29/2026 - 08:45

దేశంలో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ చెల్లింపులు, పెన్షన్ రంగానికి సంబంధించి అక్టోబరు 1 నుంచి పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్య ఖాతాదారుల నుంచి వ్యాపారుల వరకు అందరి బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఈ మార్పులేమిటో కింద చూద్దాం.

ఎస్‌బీఐ ఏటీఎం నిబంధనల్లో మార్పులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ జీతాల ఖాతా (Salary Package Account) దారులకు ఉచిత ఏటీఎం ఉపసంహరణల పరిమితిని తగ్గించింది. ఇప్పటివరకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు లభిస్తున్న 10 ఉచిత లావాదేవీల పరిమితిని 5 కి తగ్గించింది. ఈ నిబంధన ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు రెండింటికీ వర్తిస్తుంది. అయితే, ప్రాథమిక సేవింగ్స్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు 4 ఉచిత ఉపసంహరణలు యథాతథంగా కొనసాగుతాయి. పరిమితి దాటితే రూ.15 + జీఎస్టీ ఛార్జ్ పడుతుంది. డిజిటల్ లావాదేవీలు ఉచితంగానే ఉంటాయి.

బల్క్ ఎఫ్‌డీలపై ఆర్‌బీఐ మార్గదర్శకాలు

బ్యాంకులు తమ బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లను రోజూ ఉదయం 10 గంటలకల్లా పారదర్శకంగా ప్రచురించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. సమానమైన బల్క్ డిపాజిట్లకు ఒకే విధమైన వడ్డీ రేటును వర్తింపజేయాలని, లిక్విడిటీ కవరేజ్ నిష్పత్తి (ఎల్‌సీఆర్‌) ఆధారంగా మాత్రమే వ్యత్యాసాలకు అనుమతి ఉంటుందని తెలిపింది.

యూపీఐ ఎండీఆర్‌ చార్జీలు

అక్టోబరు 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట మర్చంట్ (పీ2ఎం) డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌) అమల్లోకి రానుంది. సాధారణ వ్యక్తుల మధ్య జరిపే (పీ2పీ) లావాదేవీలు, రూ.2,000 లోపు వ్యాపార చెల్లింపులు పూర్తిగా ఉచితంగానే ఉంటాయి. దాదాపు 96 శాతం డిజిటల్ లావాదేవీలపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని ప్రభుత్వం వెల్లడించింది.

ఎన్‌పీఎస్ ఖాతాల నమోదు రుసుము పెంపు

నేషనల్ పెన్షన్ సిస్టమ్ లైట్ ఖాతాలను పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీ) ద్వారా ప్రారంభించే చందాదారులు ఇకపై ప్రాణ్‌ (PRAN) కార్డు నమోదుకై ఒకసారి రూ.200 ఆన్‌బోర్డింగ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

ఎల్‌పీజీ సబ్సిడీకి బయోమెట్రిక్ ప్రామాణీకరణ

సబ్సిడీ ధరకే వంటగ్యాస్ రీఫిల్ పొందేందుకు వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (బీఏఏ) పూర్తి చేసుకోవడం తప్పనిసరి. ఇప్పటికే 89.9% మంది (27.43 కోట్ల మంది) ఈ ప్రక్రియను పూర్తి చేశారు. పూర్తి చేయనివారు గ్యాస్ డెలివరీ సమయంలో లేదా ఏజెన్సీ యాప్ ద్వారా ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: యూపీఐ చార్జీలపై ‘స్టే’కు సుప్రీం నో

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు