వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
బ్యాంకుల సమ్మె.. ఖాతాదారులపై ప్రభావమెంత!
Published on Sat, 09/26/2026 - 13:55
భారత్‌లో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ దేశవ్యాప్త బ్యాంకింగ్ సమ్మె ప్రభావం గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలపై, ముఖ్యంగా యుఏఈ నుంచి భారత్‌కు పంపే రెమిటెన్స్‌లపై పడనుంది. సెప్టెంబర్ 30 నాటి అర్ధవార్షిక ఆర్థిక ముగింపు సమయానికే ఈ సమ్మె రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సమ్మె కారణంగా బ్యాంకు శాఖల ద్వారా జరిగే ప్రత్యక్ష లావాదేవీలకు విఘాతం కలగనుంది. యూఏఈ ఎక్స్ఛేంజ్ హౌస్‌ల ద్వారా జరిగే డిజిటల్ నిధుల బదిలీలు పనిచేసినప్పటికీ భారతదేశంలోని రిసీవ్ బ్యాంకుల వద్ద సిబ్బంది ప్రాసెసింగ్ అవసరమైన రెమిటెన్స్‌లు జాప్యం అయ్యే అవకాశముంది. ఎన్ఆర్ఐలు అత్యవసర నిధుల బదిలీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆదివారం ప్రత్యేక బ్యాంకింగ్
సమ్మె వల్ల కస్టమర్లకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ సత్వర చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 27 ఆదివారం నాడు ప్రభుత్వ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పరిధిలోని శాఖలు, కరెన్సీ చెస్ట్‌లను ఓపెన్లోనే ఉంటాయి. దీనివల్ల ఖాతాదారులు సమ్మెకు ముందే తమ అత్యవసర బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకునే అవకాశం లభించింది. ప్రైవేట్ బ్యాంకులు సమ్మెలో పాల్గొననప్పటికీ ఆదివారం వాటి పనివేళలపై సంబంధిత బ్యాంకు నిబంధనలను పరిశీలించాల్సి ఉంటుంది.
దీనికితోడు, సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ఏటీఎంలపై విధించే పరిమితి దాటిన లావాదేవీల రుసుములను ఇండియన్ బ్యాంక్ వంటి పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు తాత్కాలికంగా రద్దు చేశాయి. కస్టమర్లు ఏ ఇతర బ్యాంకు ఏటీఎం నుంచైనా ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా నగదు ఉపసంహరించుకోవచ్చు.
యూపీఐ, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని, పండుగ వేళ ముందస్తుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాల చెల్లింపులకు మార్గం సుగమం చేశామని అధికారులు వెల్లడించారు. వీక్లీ ఐదు రోజులు బ్యాంకింగ్ అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో బ్యాంకర్లు ఈ సమ్మెకు దిగుతున్నారు.
ఇదీ చదవండి: ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు
Tags : 1