Breaking News

ఆదివారమూ బ్యాంకులు పనిచేస్తాయి

Published on Sat, 09/26/2026 - 13:50

శ్రీసత్యసాయి జిల్లా: తమ డిమాండ్ల సాధనకు బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 28వ తేదీ నుంచి మూడురోజుల పాటు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఈనెల 27న ఆదివారం బ్యాంక్‌ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు లీడ్‌ డి్రస్టిక్ట్‌ మేనేజర్‌ ఫణీంద్ర కుమార్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 26న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుందని, అలాగే యునైటెడ్‌ ఫోరం బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపు మేరకు ఈనెల 28 నుండీ 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ, గ్రామీణ, సహకార బ్యాంకులు మూతపడనున్నాయన్నారు. 

అందువల్ల ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా  27న ఆదివారం సాధారణ పనివేళల్లో బ్యాంక్‌ సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని  ఎల్‌డీఎం పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాదారులు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకుని ఆర్థిక అవసరాలకు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెలవు, బ్యాంకు ఉద్యోగుల సమ్మె రోజుల్లోనూ ఏటీఎంలు, కాల్‌సెంటర్లు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ పనిచేస్తాయన్నారు.  

ఇదీ చదవండి: రూ.26 లక్షలకు కొన్న ఇంటికి రూ.42 లక్షల ఆఫర్‌!


 

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)