Breaking News

ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలా? ఈ ఒక్క రూల్‌ పాటించండి!

Published on Sat, 09/26/2026 - 09:37

ఇంట్లో చిన్నచిన్న పనులను పెండింగ్‌లో పెడితే.. అవే తర్వాత పెద్ద పనులుగా మారిపోతాయి. దీంతో గందరగోళం పెరగడమే కాదు, మనసుపై కూడా ఒత్తిడి పడుతుంది. దీనికి పరిష్కారమే.. 10 నిమిషాల రూల్‌.
అంటే దీని ప్రకారం.. ఇంట్లో ఏదైనా చిన్న పని కనిపిస్తే దాన్ని తర్వాతకు వాయిదా వేయకుండా వెంటనే కొన్ని నిమిషాలు కేటాయించి పూర్తి చేయాలి. వంటగది కౌంటర్‌ శుభ్రం చేయడం, సోఫాపై ఉన్న వస్తువులను వాటి స్థానాల్లో పెట్టడం, బట్టలు సర్దడం, పాత్రలను సింక్‌లో పేరుకుపోకుండా చూడటం వంటివి.

పది నిమిషాలే ఎందుకు?
గంటల తరబడి ఇంటిని శుభ్రం చేయాలనే ఆలోచన చాలామందికి భారంగా అనిపిస్తుంది. కానీ కేవలం పది నిమిషాలు మాత్రమే కేటాయించాలనుకుంటే పని సులభంగా అనిపిస్తుంది. ఇలా రోజూ కొద్దిసేపు చేస్తే ఇంట్లో పనులు పేరుకుపోకుండా ఉంటాయి.

మనసుకూ ప్రశాంతతే..
చుట్టూ వస్తువులు చిందరవందరగా ఉన్నప్పుడు కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చు. వస్తువులను సర్దుకోవడం, చిన్న పనులను వెంటనే పూర్తి చేయడం వల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దీంతో రోజువారీ పనులను నిర్వహించుకోవడం కూడా సులభమవుతుంది.
రోజులో కేవలం పది నిమిషాలు చిన్న పనులకు కేటాయించడం ద్వారా ఇంట్లో గందరగోళాన్ని తగ్గించుకోవచ్చు. ఇల్లు సర్దితే.. మనసూ కాస్త తేలికవుతుంది!

ఇదీ చదవండి: పాత న్యూస్‌ పేపర్లు పడేయకండి.. ఇలా చేస్తే స్టైలిష్‌ బ్యాగ్స్‌ రెడీ!

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)