Breaking News

24 ఏళ్లుగా కూతురికి దూరమైన తల్లి..! నటుడు అమితాబ్‌ని సైతం..

Published on Wed, 09/23/2026 - 17:05

ఏ తల్లికి రాని కష్టం ఓ అమ్మకు ఎదురైంది. ఈ సృష్టిలో ‘అమ్మ’ అనే పదానికి మించిన ఎమోషన్‌, కనెక్షన్‌ ఇంకొకటి ఉండదు. అలాంటిది ఓ అమ్మ 24 ఏళ్లుగా కూతురి కోసం నిరీక్షిస్తూ పరితపిస్తోంది. ఆమె పెదవుల నుంచి వచ్చే ఒక్కో మాట హృదయాన్ని తాకడమే కాదు..కళ్లుచెమ్మగిల్లేలా కదిలిస్తుంది. అంతేగాదు ఇంకా ఎలాంటి మనుషుల మధ్య మనం ఉంటున్నాం అనే ఆక్రోశం, ఆక్రందన కట్టలు తెచ్చుకుంటుంది. 

ఆ మాటలు 'కౌన్ బనేగా కరోడ్‌పతి 18' కంటెస్టెంట్‌వి.  హిందీ టెలివిజన్‌ కేబీసీ పోటీలో పాల్గొన్న కపిలా తనేజా తాను ఎదుర్కొన్న గృహహింస గురించి చెబతున్నప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె కథ బిగ్‌బీ, బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ని కదిలించింది. ఆమె కథ విని ఆయన సైతం దిగ్బ్రాంతికి గురయ్యారు. చత్తీశ్‌గడ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన కపిలా తనేజా తన కథను చెప్పుకొచ్చింది కేబీసీ షోలో ఇలా. 

తాను కులాంతర ప్రేమ వివాహం చేసు కోవడంతో అత్తారింట్లో తనకు ఎదురైన గృహహింస గురించి వివరించింది. అదనపు కట్నం కోసం హింసించేవారని, పైగా తనపై కిరోశిన్‌ వేసి నిప్పు పెట్టిన ఉదంతం గురించి కూడా వివరించింది. అది చలికాలం కావడంతో ఒంటిపై ఉన్న బట్లలు చర్మానికి అతుక్కుపోయాయని నాటి భయానక ఘటనను గుర్తు చేసుకుంది. ఆ ఘటన తర్వాత ఎవరో అపరిచితులు తనను కాపాడి ఆస్పత్రిలో జాయిన్‌ చేసినట్లు వాపోయింది. అయితే ఆ తదనంతరం తిరిగి అత్తారింటికి వచ్చాక మరింతగా వేధింపులు, చీత్కారాలు ఎక్కువైనట్లు తెలిపింది. 

పైగా తన కన్న కూతురికి దూరమైపోయానని, పుట్టిన తర్వాత నుంచి తన ముఖం ఇవాల్టి వరకు తన అత్తమామలు, భర్త చూపించలేదని చెప్పుకొచ్చిందామె. కోర్టులు చుట్టూ ఈ విషయమై తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపింది. సుమారు 24 ఏళ్లుగా ఆమె పిలుపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నట్లు వాపోయింది. ఆమె ఎలా ఉంటుంది, ఏం చేస్తుందన్న సమాచారం ఏమి తనకు తెలియదని ఆవేదనగా చెప్పుకొచ్చింది. పక్కింటి వాళ్ల సమాచారం మేరకు ఆమె ఉద్యోగం చేస్తుందని మాత్రమే తెలుసని ఉద్వేగంగా చెప్పింది. 

అంతేగాదు అమితాబ్‌ని తన కుమార్తెకు ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆ తల్లి అడగడం బిగ్‌బీని కదిలిచింది. ఆమె కథ విని చలించిపోయిన అమితాబ్‌ ఆమెకు ఆశీర్వాదం అందించే అర్హత తనకు లేదన్నారు. ఈ ప్రపంచంలో పిల్లలకు అత్యంత అవసరమైనది, ప్రయోజనకరమైనది, ఏదైనా ఉందంటే అది ‘అమ్మ’ మాత్రమే. సమాజంలో తల్లికి ఉన్న స్థానమే వేరు. దయచేసి కపిల కూతురు ఎక్కడ ఉన్న అమ్మ అని ఒక్కసారి అనండి..మీ అమ్మ మన ముందు కూర్చొని ఉంది. 

ఆమె మిమ్మల్ని కలవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. కనీసం ఈ షో ద్వారానైనా ఈ తల్లి కూతుళ్లు కలుస్తారని ఆశిస్తున్నా అని గద్గద స్వరంతో అన్నారు అమితాబ్‌. ఆమె కథ ఆ షోని చూస్తున్న ప్రేక్షకులందర్నీ కదలించడమే కాదు..ఇలాంటి కన్నీటి కథలు మన చుట్టూ ఎన్ని ఉన్నాయో అంటూ సర్వత్ర చర్చలు మొదలవ్వడం విశేషం.

 

ఇదీ చదవండి: సీనియర్‌ డాక్టర్‌.. వైద్య వృత్తిని వదిలేసి వ్యాపారం! లాభాలు వచ్చాయా?)
 

Videos

2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థిని మృతి

ఉద్యోగులకు భారీ బొనాంజా! కనీస వేతనం ₹63 వేలు!

సుమలతపై తోటి డాన్సర్ల దాడి...!

లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం

ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..

చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం

నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే

MLA చెప్పినవారికే పింఛన్లు.. బయటపడ్డ సంచలన ఆడియో క్లిప్

జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్

Photos

+5

ఫ్యామిలీతో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్.. ఫోటోలు

+5

గ్రాండ్‌గా స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు

+5

ది ప్యారడైజ్‌ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు

+5

బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు

+5

తిరుమల : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం (ఫొటోలు)

+5

మధుబని ఓధనా చీరలో మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌.. (ఫొటోలు)

+5

చీరలో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

పట్టుచీర.. మల్లెపూలు.. మెరిసిపోతున్న హెబ్బా (ఫొటోలు)

+5

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)

+5

తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)