Breaking News

‘కాస్‌’ సవాళ్లకు సెబీ చెక్‌! క్యాష్‌ మార్కెట్‌ ముగింపు ధర డీలింక్‌

Published on Wed, 09/23/2026 - 15:27

క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ రోజు నమోదవుతున్న సెటిల్‌మెంట్‌ ధరలు, ఇతర ససంబంధిత సమస్యలపై దృష్టి పెట్టింది. ఇందుకు ఈ నెల మొదట్లోనే కన్సల్టేషన్‌ పేపర్‌ను విడుదల చేసింది. మార్కెట్‌ పార్టిసిపెంట్ల ఆందోళనలకు తెరదించే ప్రయత్నంలో భాగంగా పబ్లిక్‌ నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. తద్వారా ఎక్స్‌పైరీ రోజు సెటిల్‌మెంట్‌ ధరల ఇండెక్స్, సింగిల్‌ స్టాక్‌ డెరివేటివ్స్‌లో సవాళ్లకు చెక్‌ పెట్టే యోచనలో ఉంది. దీనిలో భాగంగా క్యాష్‌ మార్కెట్‌ ముగింపు ధరను ఎఫ్‌అండ్‌వో సెటిల్‌మెంట్‌ ధరలతో డీలింక్‌ చేయనుంది.

అంతేకాకుండా ముగింపు వేలం(కాస్‌) సమయంలో లైవ్‌ ఇండికేటింగ్‌ ఇండెక్స్‌ విలువలను నిలిపివేయనుంది. ట్రేడర్లు 1 శాతానికి ఎగువన పెట్టే ఆర్డర్లను కొనసాగించేలా నిబంధనలను సవరించడం తదితరాలపై దృష్టిపెట్టినట్లు సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తాజాగా వివరించారు. నిర్మాణాత్మక మార్కెట్‌లో భాగంగా తీసుకువచి్చన కాస్‌ సంస్కరణలో సవరణలు చేపట్టనున్నట్లు మోర్గాన్‌ ఇండియా 11వ సదస్సు సందర్భంగా వెల్లడించారు. సెటిల్‌మెంట్‌ ధర నిర్ధారణలో రెండు అవకాశాలను ప్రతిపాదిస్తున్నట్లు తెలియజేశారు.

కంటిన్యుయస్‌ ట్రేడింగ్‌ సెషన్‌(సీటీఎస్‌)లో చివరి 30 నిమిషాలు, కాస్‌లో చివరి 10 నిమిషాల లావాదేవీలను వాల్యూమ్‌ వెయిటెడ్‌ సగటు ధర(వీడబ్ల్యూఏపీ), సెటిల్‌మెంట్‌ ధరతో మిక్స్‌ చేయడం(బ్లెండెడ్‌) వీటిలో ఒకటికాగా.. ఫిక్స్‌డ్‌ వెయిట్‌ పద్ధతిలోకాకుండా వాస్తవిక ట్రేడెడ్‌ విలువ ఆధారంగా మదింపు చేయనున్నారు. రెండో ఆప్షన్‌లో భాగంగా ప్రస్తుత సీటీఎస్‌ పరిమాణం వీడబ్ల్యూఏపీ మెథడాలజీని కొనసాగించనుంది. అయితే సీటీఎస్‌లో భాగంగా చివరి 30 నిమిషాల లావాదేవీలను మాత్రమే పరిగణిస్తారు.

#

Tags : 1

Videos

2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థిని మృతి

ఉద్యోగులకు భారీ బొనాంజా! కనీస వేతనం ₹63 వేలు!

సుమలతపై తోటి డాన్సర్ల దాడి...!

లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం

ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..

చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం

నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే

MLA చెప్పినవారికే పింఛన్లు.. బయటపడ్డ సంచలన ఆడియో క్లిప్

జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్

Photos

+5

ఫ్యామిలీతో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్.. ఫోటోలు

+5

గ్రాండ్‌గా స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు

+5

ది ప్యారడైజ్‌ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు

+5

బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు

+5

తిరుమల : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం (ఫొటోలు)

+5

మధుబని ఓధనా చీరలో మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌.. (ఫొటోలు)

+5

చీరలో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

పట్టుచీర.. మల్లెపూలు.. మెరిసిపోతున్న హెబ్బా (ఫొటోలు)

+5

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)

+5

తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)