Breaking News

రేసుగుర్రంలా ఆటో రంగం!

Published on Wed, 09/23/2026 - 08:28

దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమపై ‘జీఎస్‌టీ 2.0’ సంస్కరణలు అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపినట్లు పరిశ్రమ దిగ్గజాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్‌టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో టాటా మోటార్స్, హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, మహీంద్రా గ్రూప్, మారుతీ సుజుకీ ఇండియా సంస్థల సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

పన్నుల తగ్గింపు ఫలితంగా వాహనాల ధరలు అందుబాటులోకి రావడమే కాకుండా, వినియోగదారుల సెంటిమెంట్‌ బలపడి అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు గణనీయంగా పెరిగాయన్నారు. ప్రత్యేకించి ఎంట్రీ–లెవెల్‌ (ప్రారంభ శ్రేణి) కార్ల ధరలు తగ్గడం వల్ల కస్టమర్ల పరిధి బాగా విస్తరించిందని తెలిపారు. మార్కెట్లో నమోదవుతున్న ఈ బలమైన డిమాండ్‌ ఆధారంగా ఆటో తయారీ సంస్థలు తమ మూలధన వ్యయాన్ని (క్యాపెక్స్‌) పెంచడంతో పాటు, ఉత్పత్తి సామర్థ్య విస్తరణను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.

గతేడాది (2025) సెప్టెంబర్‌ 22న జీఎస్‌టీ కౌన్సిల్‌ చేపట్టిన పన్నుల సవరణ ఆటో రంగానికి ప్రధాన ఊతంగా నిలిచింది. దీని ప్రకారం చిన్న తరహా వాహనాలపై జీఎస్‌టీ రేటును గతంలో ఉన్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. 1,200 సీసీ లోపు ఇంజిన్, 4,000 మిల్లీమీటర్ల లోపు పొడవున్న పెట్రోల్, సీఎన్‌జీ, ఎల్‌పీజీ కార్లతో పాటు.. 1,500 సీసీ లోపు ఉన్న డీజిల్‌ వాహనాలకు ఈ పన్ను కోత వర్తిస్తుంది. ఈ పన్నుల హేతుబదీ్ధకరణతో వాహనాల ధరలు తగ్గి, వివిధ విభాగాల్లో కొనుగోలు డిమాండ్‌కు బలమైన మద్దతు లభించింది. 

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా  

భారతీయ ఆటోమొబైల్‌ రంగానికి జీఎస్‌టీ 2.0 సంస్కరణలు ప్రధాన ఉ్రత్పేరకంగా మారి, మార్కెట్‌ లభ్యతను పెంచడంతో పాటు వినియోగదారుల్లో నమ్మకాన్ని బలపరిచాయి. ఈ సంస్కరణలు భారతీయ కుటుంబాల ‘సొంత వాహన కల’ను సాకారం చేసుకునేలా చేశాయి. దేశంలో సులువైన, సమర్థవంతమైన, వృద్ధి ఆధారిత పన్ను విధానం వైపు సాగిన ప్రయాణంలో జీఎస్‌టీ 2.0 ఒక ముఖ్యమైన మైలురాయి. ఇవి ఆటోమొబైల్‌ రంగానికి బలమైన పునాదిని వేశాయి, రాబోయే రోజుల్లోనూ దీర్ఘకాలిక సుస్థిర వృద్ధికి మద్దతుగా నిలుస్తాయి’’ అని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ, సీవోఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు.

మహీంద్రా అండ్‌ మహీంద్రా  

జీఎస్‌టీ సరళీకరణ ప్రయోజనాలు మహీంద్రా గ్రూప్‌లోని అన్ని వ్యాపార విభాగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పన్ను తగ్గించినప్పటి నుంచి ఎస్‌యూవీల విక్రయాలు 17 శాతం పెరగ్గా, తేలికపాటి వాణిజ్య వాహనాలు (ఎల్‌సీవీలు), ట్రాక్టర్ల విక్రయాలు 20 శాతం వృద్ధి చెందాయి. పన్నుల సవరణ వల్ల ధరలు అందుబాటులోకి వచి్చ.. అటు పట్టణాల్లో, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ ఎంతగా పెరిగిందో ఈ అమ్మకాల గణాంకాలే నిరూపిస్తున్నాయి. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతున్నాం’’ అని మహీంద్రా గ్రూప్‌ ఎండీ, సీఈవో అనీష్‌ షా తెలిపారు.

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌

‘‘దేశ ఆర్థిక వ్యవస్థకు ‘జీఎస్‌టీ 2.0’ అమలు బూస్టర్‌లా పనిచేసింది. వాహన ధరలు అందుబాటులోకి రావడం, వినియోగదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడమే ఇందుకు నిదర్శనం. అనుకూల ప్రభుత్వ విధానాలు, అందుబాటు ధరలు, నూతన మోడళ్ల ఆవిష్కరణ కలయికతో ఆటో విక్రయాలు మరింత పెరుగుతాయి. గతేడాది కాలంలో సాధించిన ఈ ప్రగతి, భారతీయ వినియోగదారులకు నూతన శకం రవాణా సౌకర్యాలను మరింత చేరువ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అని టీఎంపీవీ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో శైలేష్‌ చంద్ర తెలిపారు.

మారుతీ సుజుకీ ఇండియా  

జీఎస్‌టీ సంస్కరణలు భారత వృద్ధి ప్రయాణానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా మారుతీ సుజుకీ ఎంట్రీ–లెవెల్‌ విభాగంలో అత్యంత బలమైన వృద్ధిని నమోదు చేసింది. 2026 ఏప్రిల్‌ – ఆగస్టు మధ్య కాలంలో మారుతీ సుజుకీ ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు వార్షికంగా దాదాపు 36 శాతం పెరిగాయి. ప్రత్యేకించి ఎంట్రీ–లెవెల్‌ విభాగంలో ఏకంగా 96 శాతానికి పైగా వృద్ధి సాధించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. మార్కెట్‌ నుంచి లభిస్తున్న ఈ ఆదరణతో తమ మూలధన వ్యయం (క్యాపెక్స్‌) ప్రణాళికలను వేగవంతం చేస్తున్నాం. దేశీయ పరిశ్రమ విస్తరించి, పోటీతత్వం పెరిగినప్పుడు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు భారత్‌వైపు మళ్లుతాయి, ఫలితంగా ఎగుమతులు కూడా పెరుగుతాయి.’’ అని మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో హిసాషి టకేయుచి తెలిపారు.

ఇదీ చదవండి: పెట్రోల్ డీలర్ల సంచలన నిర్ణయం

Videos

2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థిని మృతి

ఉద్యోగులకు భారీ బొనాంజా! కనీస వేతనం ₹63 వేలు!

సుమలతపై తోటి డాన్సర్ల దాడి...!

లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం

ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..

చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం

నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే

MLA చెప్పినవారికే పింఛన్లు.. బయటపడ్డ సంచలన ఆడియో క్లిప్

జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్

Photos

+5

ఫ్యామిలీతో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్.. ఫోటోలు

+5

గ్రాండ్‌గా స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు

+5

ది ప్యారడైజ్‌ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు

+5

బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు

+5

తిరుమల : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం (ఫొటోలు)

+5

మధుబని ఓధనా చీరలో మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌.. (ఫొటోలు)

+5

చీరలో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

పట్టుచీర.. మల్లెపూలు.. మెరిసిపోతున్న హెబ్బా (ఫొటోలు)

+5

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)

+5

తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)