2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం
Breaking News
ఎక్కువ సినిమాలు చేయడం సక్సెస్ కాదు
Published on Wed, 09/23/2026 - 07:13
ఏ రంగంలోనైనా సరే సక్సెస్ అవ్వాలనే చూస్తారు. ఒక్కసారి విజయం సాధిస్తే తర్వాత జీవితమే మారిపోతుంది. అది సక్సెస్‌కి ఉన్న పవర్. అయితే ఇది వరించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం తోడవ్వాలి. అలాంటి అదృష్టం కోసమే హీరోయిన్ నిధి అగర్వాల్ ఎదురుచూస్తోంది. హైదరాబాద్‌లో పుట్టిన ఈ బ్యూటీ.. 2017లో మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చింది. నాగచైతన్య 'సవ్యసాచి'తో తెలుగులోకి వచ్చింది. 'భూమి'తో తమిళంలోకి పరిచయమైంది.
అయితే గత నాలుగైదేళ్లలో తెలుగులో పవన్ కల్యాణ్‌తో హరిహర వీరమల్లు, ప్రభాస్‌తో రాజాసాబ్ మూవీస్ మాత్రమే చేసింది. వీటిపై చాలా ఆశలు పెట్టుకుంది గానీ ఇవి దారుణంగా నిరాశపరిచాయి. చెప్పాలంటే ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. అయినప్పటికీ సరైన సక్సెస్ కోసం ఈ బ్యూటీ పోరాడుతూనే ఉంది. ఆకర్షణీయమైన అందం, అభినయం ఉన్నా పాన్ ఇండియా కథానాయికిగా గుర్తింపు వచ్చినా వాటికి అదృష్టం మాత్రం తోడవ్వలేదు. అందుకే హీరోయిన్గా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడమే సక్సెస్ కాదు. ప్రతిభని నిరూపించుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగడమే నిజమైన విజయం. అలా దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో మంచి అవకాశాల కోసం నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నటిగా సాధించాలన్న తన లక్ష్యమే తనకు ఉత్తేజం పరుస్తోంది. సహజంగానే నేను కష్టజీవిని. నేను చేరాల్సిన స్థానం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను అని నిధి అగర్వాల్ పేర్కొంది.
Tags : 1