నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
ఎగరలేని రామచిలుక కోసం.. యజమాని ఐడియా ఇప్పుడు వైరల్!
Published on Sun, 09/20/2026 - 13:15
రెక్కలు దెబ్బతింటే పక్షి ఎగరడం కష్టమే. కానీ ఈ రామచిలుక విషయంలో మాత్రం అలా జరగలేదు. యజమాని చేసిన ఓ అద్భుత ప్రయత్నంతో రెక్కలు పనిచేయకపోయినా.. అది మళ్లీ ఆకాశంలోకి ఎగరగలుగుతోంది.
ఫిలిప్పీన్స్‌లోని డవావో నగరంలో మార్క్ జోసెఫ్ కొలాండో అనే వ్యక్తి ముచ్చటగా ఒక పంచవన్నెల రామచిలుకను పెంచుకుంటున్నాడు. ఒకనాడు రామచిలుకపై ఒక పిల్లి దాడిచేసింది. పిల్లి దాడిలో రామచిలుక రెక్కలు రెండూ దెబ్బతిన్నాయి. అప్పటి వరకు స్వేచ్ఛగా ఎగరగలిగే రామచిలుక ఎగరలేని స్థితిలో మూలపడింది.
తన రామచిలుకను ఎగరలేని స్థితిలో చూసి మార్క్ కలత చెందాడు. గాయపడ్డ చిలుక తిరిగి ఎగరడానికి ఏదైనా చేయాలని తలచాడు. అప్పుడే అతడికి అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచే ఈ డ్రోన్ రూపుదిద్దుకుంది. ఈ డ్రోన్‌కు రామచిలుక సౌకర్యంగా కూర్చునేలా ప్లాస్టిక్ క్యాబిన్‌ను అమర్చాడు. ఇప్పుడు ఈ రామచిలుక డ్రోన్‌కు అమర్చిన క్యాబిన్లో చక్కగా కూర్చుని, డ్రోన్ రెక్కల సాయంతో మళ్లీ ఎగరగలుగుతోంది.
ఇదీ చదవండి: పూల రారాణి గులాబీ.. ప్రపంచాన్ని ఎలా చుట్టేసిందో తెలుసా?
Tags : 1