నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
వినాయక నిమజ్జనంలో దిల్ రాజు సతీమణి మాస్ డ్యాన్స్..వీడియో వైరల్
Published on Sun, 09/20/2026 - 12:55
హైదరాబాద్లో వినాయక నిమజ్జనోత్సవాలు భక్తుల కోలాహలం మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలు సందడిగా మారాయి. డప్పు చప్పుళ్లు, డీజే పాటలు, నృత్యాలతో యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు కూడా నిమజ్జన వేడుకల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దిల్ రాజు కూడా తన కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం నిమజ్జన కార్యక్రమంలో ఆయన సతీమణి తేజస్వినితో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీన్మార్ పాటకు దిల్ రాజు తన సతీమణితో కలిసి స్టెప్పులు వేస్తూ కనిపించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఆయన ఉత్సాహంగా నృత్యం చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
నిన్న గణేశ్ నిమజ్జనం వేడుకల్లో నిర్మాత #DilRaju జోష్ pic.twitter.com/gP4if8uslS
— Rajesh Manne (@rajeshmanne1) September 20, 2026
దిల్ రాజు వైఫ్ తేజస్విని తీన్మార్ డాన్స్ 🔥💃
ఫుల్ మాస్ ఎనర్జీ… అదిరిపోయిందిగా! 🔥😍#Tejaswini #TeenmaarDance #DilRaju pic.twitter.com/jXjJvDqK0l— Janya Digital Media (@janyamedia1) September 19, 2026
Tags : 1