నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై
Breaking News
పూల రారాణి గులాబీ.. ప్రపంచాన్ని ఎలా చుట్టేసిందో తెలుసా?
Published on Sun, 09/20/2026 - 11:43
ప్రపంచంలో గులాబీని పూల రారాణి అంటారు. గులాబీల గుబాళింపు ప్రపంచానికి సహస్రాబ్దాలుగా తెలుసు. భూమ్మీద ఉత్తరార్ధగోళంలో ఉన్న దాదాపు అన్ని దేశాలకు గులాబీలు పురాతన కాలం నుంచి తెలుసు.
భారత భూభాగంలోని హిమాలయ ప్రాంతంలో గులాబీలు విరివిగా పూసేవి. మొఘల్ చక్రవర్తుల కాలంలో గులాబీలకు బాగా ఆదరణ పెరిగింది. కాకతీయుల కాలం నాటికి గులాబీలు దక్షిణ భారత ప్రాంతానికి కూడా విరివిగా విస్తరించాయి. గులాబీల గురించి మరిన్ని విశేషాలను గణాంకాల్లో...
పంతొమ్మిదో శతాబ్దిలో ఇది దక్షిణార్ధగోళానికి కూడా వ్యాపించింది. ప్రాచీన గ్రీకు, రోమన్, మెసపటేమియన్ నాగరికతల ప్రజలు గులాబీ తోటలను విరివిగా పెంచేవారు. గులాబీలతో పరిమళ ద్రవ్యాల తయారీలోను, ఔషధాల తయారీలోను నాటి ప్రజలు ఉపయోగించేవారు.
ఇదీ చదవండి: బట్టతల వచ్చిందా? స్టయిల్ మార్చండి.. లుక్ అదిరిపోవాల్సిందే!
Tags : 1