Breaking News

కత్రినాపై బాడీ షేమింగ్‌.. చొక్కా విప్పిన షారుక్‌ఖాన్‌

Published on Sun, 09/20/2026 - 11:22

సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలపై బాడీ షేమింగ్‌, ఏజ్‌ షేమింగ్‌, వ్యక్తిగత విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిపై నెటిజన్లు చేసే కామెంట్స్‌ తరచూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా ఈ ధోరణిపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తీవ్రంగా స్పందించారు.  ఇటీవల తన బాడీపై వచ్చి ట్రోల్స్‌కు హిందీ బిగ్‌బాస్‌ షోలో కౌంటరిచ్చారు.
నేను ముసలివాణ్ని అయిపోయానా..
‘నేను ముసలివాణ్ని అయిపోయాను అంటున్నారు’ అని షర్ట్‌ విప్పి బాడీ చూపించారు. మొఖానికి ఉన్న మేకప్‌ సైతం చెరిపేశారు.‘దమ్ముంటే ఇప్పుడు నన్ను ట్రోల్‌ చేయండి’ అన్నట్టుగా సవాల్‌ విసిరారు. తనను విమర్శించే ముందు ఎవరికి వాళ్లు వారి మొఖాలు, బాడీ చూసుకోవాలని తెలిపారు. సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్‌ థ్రిల్లర్‌.. డోంట్‌ మిస్‌

కత్రినాపై బాడీ షేమింగ్‌..
కత్రినా కైఫ్‌ బాడీ షేమింగ్‌కు గురైన విషయాన్ని ట్రోలర్స్‌కు తనదైన శైలిలో గట్టి కౌంటర్‌ ఇచ్చారు. మహిళల శరీరంలో గర్భధారణ సమయంలో అనేక మార్పులు రావడం సహజమేనని, బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే వారు మునుపటి శరీరాకృతికి తిరిగి రావాలని ఆశించడం సరికాదని స్పష్టం చేశారు. సెలబ్రిటీలను వారి శరీరాకృతి, వయసు లేదా వ్యక్తిగత విషయాల ఆధారంగా విమర్శించడం సరికాదనే సందేశాన్ని సల్మాన్‌ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు.  ముఖ్యంగా తల్లులుగా మారిన హీరోయిన్ల విషయంలో శరీరంలో వచ్చే మార్పులను అర్థం చేసుకోవాలని సూచించారు. సినిమాల్లోకి తిరిగి వచ్చినప్పుడు వారు తమకు అనుకూలమైన సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెడతారని చెప్పారు.
ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి చిరంజీవి.. ప్రపంచ రికార్డ్‌ బద్దలయ్యేలా ప్లాన్!
 

 STANDING OVATION!#SalmanKhan took off his T-shirt, showed his body and challenged if you want to troll, go ahead and do it.​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​

He just shut the haters up again. He doesn’t care about trolling #BiggBoss20 pic.twitter.com/YGbVM8X9om

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)